తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Phd Admissions: ఇక నెట్‌ స్కోర్‌తోనే పిహెచ్‌డి ప్రవేశాలు..వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు అవసరం లేదన్న యూజీసీ

Phd Admissions: ఇక నెట్‌ స్కోర్‌తోనే పిహెచ్‌డి ప్రవేశాలు..వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు అవసరం లేదన్న యూజీసీ

Sarath chandra.B HT Telugu

29 March 2024, 7:54 IST

    • Phd Admissions: పిహెచ్‌డి ప్రవేశాలకు వేర్వేరుగా యూనివర్శిటీలు ప్రవేశపరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని, యూజీసీ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ స్కోర్ ఉంటే సరిపోతుందని స్పష్టత ఇచ్చింది. 
నెట్‌ స్కోర్‌తోనే ఇకపై పిహెచ్‌డి ప్రవేశాలు
నెట్‌ స్కోర్‌తోనే ఇకపై పిహెచ్‌డి ప్రవేశాలు (HT_PRINT)

నెట్‌ స్కోర్‌తోనే ఇకపై పిహెచ్‌డి ప్రవేశాలు

Phd Admissions: దేశంలోని విశ్వ విద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలకు యూజీసీ నెట్‌స్కోర్ NET Score సరిపోతుందని స్పష్టత ఇచ్చింది. పిహెచ్‌డి Phd Admissions ప్రవేశాలకు వేర్వేరుగా నిర్వహించే ప్రవేశ పరీక్షల అవసరం లేకుండా 2024-25 విద్యా సంవత్సరం నుంచి పీహెచ్డీ ప్రవేశాలకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) స్కోర్లను ఉపయోగించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

TS EdCET 2024 : టీఎస్ ఎడ్ సెట్ దరఖాస్తుల సవరణలకు అవకాశం, మే 15 చివరీ తేదీ!

Telangana Temples Tour : తెలంగాణ టెంపుల్స్ టూర్, 24 గంటల్లో 5 ప్రముఖ దేవాలయాల సందర్శన

10Years Telangana: కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు, ప్రవాస తెలంగాణ వాసుల సంబురాలు

Road Accident: ఓటేయడానికి వెళుతూ యాక్సిడెంట్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి, జనగామలో హైవేపై విషాదం

ఏడాదికి రెండుసార్లు నెట్‌ పరీక్షను యూజీసీ UGC నిర్వహిస్తోంది. ఏటా జూన్, డిసెంబర్ లలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. నెట్‌ స్కోర్‌ను ప్రస్తుతం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) JRF ఇవ్వడానికి, మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారికి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా Asst Professors నియామకానికి అర్హతగా ఉపయోగిస్తున్నారు.

యూజీసీ పరీక్షల నిబంధనలను సమీక్షించడానికి కమిషన్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని, కమిటీ సిఫార్సుల ఆధారంగా 2024-25 విద్యా సంవత్సరం నుంచి పిహెచ్‌డి ఫెలోషిప్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి అయా సబ్జెక్టుల్లో నెట్‌ స్కోర్‌ను ప్రమాణికంగా తీసుకోవాలని నిర్ణయించినట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధికారులు వివరించారు.

2024-2025 విద్యాసంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నెట్ స్కోర్ ఉపయోగించుకోవచ్చని స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలకు విడిగా ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు విడిగా రీసెర్చ్‌ టెస్ట్ నిర్వహిస్తున్నాయి.

విశ్వవిద్యాలయాలు, ఐఐటీల వంటి ఉన్నత విద్యా సంస్థలు నిర్వహించే ప్రత్యేక ప్రవేశ పరీక్షల అవసరాన్ని తాజా నిర్ణయం సరళం చేస్తుందని యూజీసీ భావిస్తోంది. పిహెచ్‌డి అడ్మిషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడంలో, డాక్టోరల్ కోర్సుల్లో అభ్యర్థులకు అవకాశాలను పెంచడంలో ఉపకరిస్తుందని చెబుతున్నారు.

విద్యార్ధులకు మరింత వెసులుబాటు…

ఏటా రెండు సార్లు నిర్వహించే నెట్ ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు మరింత వెసులుబాటు కల్పించవచ్చని, వివిధ సంస్థల్లో పీహెచ్ డీ ప్రోగ్రామ్ లకు దరఖాస్తు చేసుకునేందుకు ఏ సెషన్ నుంచైనా విద్యార్ధులు తమ సబ్జెక్ట్ స్కోర్ ను వినియోగించుకోవచ్చని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుందని కుమార్ వివరించారు.

దేశంలో వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించే బహుళ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావడానికి మరియు హాజరు కావడానికి ఇది అవసరాన్ని తొలగిస్తుంది. విద్యార్ధులపై పరీక్షల లాజిస్టిక్స్, ఖర్చుల భారాన్ని తగ్గిస్తుంది. నెట్ యొక్క ద్వైవార్షిక పరిపాలన విద్యార్థులకు వారు కోరుకున్న పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందడానికి ఎక్కువ అవకాశాలను అందిస్తుంది.

2024-2025 విద్యాసంవత్సరం నుంచి పీహెచ్‌డి ప్రవేశాల కోసం నెట్ ఎగ్జామ్ స్కోర్లను అవలంబించాలని అన్ని విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. దేశంలో విద్యాభ్యాసానికి, మెరుగైన పరిశోధనలకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తుందని ఛైర్మన్ తెలిపారు.

మూడు విభాగాల్లో అర్హతలు…

జూన్ 2024 నుంచి నెట్ అభ్యర్థులను మూడు కేటగిరీల్లో అర్హులుగా ప్రకటిస్తామని యూజీసీ ప్రకటించింది. జూనియర్‌ రీసెర్చ్ ఫెలోషిప్‌లతో పీహెచ్‌డిలో ప్రవేశం, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లుగా నియామకం, జేఆర్ఎఫ్ లేకుండా నేరుగా పీహెచ్‌డిలో ప్రవేశం, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నియామకం, కేవలం పీహెచ్‌డి ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి మాత్రమే అర్హత ఇవ్వనున్నారు.

యూజీసీ నెట్ ఫలితాలను పీహెచ్ డీలో ప్రవేశానికి వినియోగించుకునేందుకు అభ్యర్థి సాధించిన మార్కులతో పాటు పర్సంటైల్ విధానంలో ప్రకటిస్తారు. 2, 3 కేటగిరీల్లో అర్హత సాధించిన విద్యార్థులకు పీహెచ్ డీ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష మార్కులకు 70 శాతం, ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఇస్తారు. నెట్ మార్కుల కంబైన్డ్ మెరిట్, ఇంటర్వ్యూ లేదా వైవా వోసీలో వచ్చిన మార్కుల ఆధారంగా పీహెచ్డీ అడ్మిషన్ ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

రెండేళ్ల చెల్లుబాటు…

2, 3 కేటగిరీల్లో అభ్యర్థులు నెట్ లో సాధించిన మార్కులు పీహెచ్ డీలో ప్రవేశానికి ఏడాది పాటు చెల్లుబాటు అవుతాయి. యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చే వారం ప్రారంభం కానుంది.

తదుపరి వ్యాసం