తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Csir Ugc Net 2023: యూజీసీ నెట్ కి అప్లై చేశారా?.. లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా..?

CSIR UGC NET 2023: యూజీసీ నెట్ కి అప్లై చేశారా?.. లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా..?

HT Telugu Desk HT Telugu

02 November 2023, 10:02 IST

    • CSIR UGC NET 2023: డిసెంబర్ లో జరిగే సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ (CSIR-UGC NET) 2023 కి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పరీక్షకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నవంబర్ 30. ఆసక్తి అర్హత ఉన్న విద్యార్థులు యూజీసీ అధికారిక వెబ్ సైట్ csirnet.nta.ac.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CSIR UGC NET 2023: సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. 2023 డిసెంబర్ లో నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు నవంబర్ 30 లోగా ఆన్ లైన్ లో అధికారిక వెబ్ సైట్ csirnet.nta.ac.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

CBSE Class 10 results : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

CBSE class 12 results 2024 : సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

పరీక్ష ఎప్పుడు?

ఈ పరీక్షను ఈ సంవత్సరం డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 180 నిమిషాలు లేదా మూడు గంటలు. పరీక్ష పేపర్‌లో ఆబ్జెక్టివ్-టైప్ ప్రశ్నలు ఉంటాయి.

CSIR-UGC NET పరీక్షలో ఐదు పేపర్లు ఉంటాయి

కెమికల్ సైన్సెస్

ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్

లైఫ్ సైన్సెస్

మేథమెటికల్ సైన్సెస్

ఫిజికల్ సైన్సెస్

ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ బాషల్లో ఉంటుంది. విద్యార్హతలు, కోర్స్ కోడ్స్, పరీక్ష ఫీజు మొదలైన పూర్తి వివరాల కోసం విద్యార్థులు csirnet.nta.ac.in. వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ను పరిశీలించాలి. అప్లై చేసేముందు విద్యార్థులు ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో పేర్కొన్న విధంగా అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా పరిశీలించాలి. పరీక్ష ఫీజును డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా UPI ఉపయోగించి పేమెంట్ గేట్‌వే ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఇతర అనుమానాలేవైనా ఉంటే NTA హెల్ప్ డెస్క్‌కి 011-40759000 లేదా 011-69227700కి కాల్ చేయవచ్చు లేదా csirnet@nta.ac.inలో NTAకి మెయిల్ చేయవచ్చు. ఈ కింద పేర్కొన్న డైరెక్ట్ లింక్ ద్వారా విద్యార్థులు ఈ యూజీసీ నెట్ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం