UGC NET results 2023: యూజీసీ నెట్ రిజల్ట్స్ వచ్చేశాయి.. మీ ఫలితాన్ని ఇలా చెక్ చేసుకోండి..
UGC NET results 2023: యూజీసీ నెట్ ఫలితాలను ఎన్టీఏ మంగళవారం విడుదల చేసింది. జూన్ 2023 లో యూజీసీ నెట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ స్కోర్స్ ను ugcnet.nta.nic.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
UGC NET results 2023: యూజీసీ నెట్ ఫలితాలను ఎన్టీఏ మంగళవారం విడుదల చేసింది. జూన్ 2023 లో యూజీసీ నెట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ స్కోర్స్ ను ugcnet.nta.nic.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
మొత్తం 81 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్
2023 సంవత్సరానికి గానూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) ఫలితాలను మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అలాగే, ఫైనల్ ఆన్సర్ కీని కూడా విడుదల చేసింది. ఫైనల్ కీని, రిజల్ట్ ను అభ్యర్థులు ugcnet.nta.nic.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. యూజీసీ నెట్ 2023 ప్రొవిజనల్ ఆన్సర్ కీని జులై 6వ తేదీన రిలీజ్ చేశారు. 2023 లో యూజీసీ నెట్ పరీక్షను మొత్తం 83 సబ్జెక్టుల్లో, దేశవ్యాప్తంగా 181 నగరాల్లో నిర్వహించారు. ఈ పరీక్షను జూన్ 13 నుంచి 17 మధ్య, అలాగే, జూన్ 19 నుంచి 22 మధ్య రెండు దశల్లో నిర్వహించారు. మొత్తం 6,30,069 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
రిజల్ట్ తో పాటు ఆన్సర్ కీ, కటాఫ్ మార్క్స్ కూడా..
విద్యా సంస్థల్లో పరిశోధనలకు ఉద్దేశించిన జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ (JRF and Assistant Professor) తో పాటు, వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్ట్ లకు అర్హత పరీక్షగా ఈ యూజీసీ నెట్ ను ప్రతీసంవత్సరం నిర్వహిస్తారు. విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) కు అర్హత అందిస్తారు. తాజాగా, 2023 సంవత్సరం యూజీసీ నెట్ ఫలితాలతో పాటు జేఆర్ఎఫ్ (JRF) కటాఫ్ మార్క్స్ ను, అసిస్టెంట్ ప్రొఫెసర్ షిప్ (Assistant Professor) కటాఫ్ మార్క్స్ ను కూడా ఎన్టీఏ ప్రకటించింది. ఈ కటాఫ్ టేబుల్ ను కూడా విద్యార్థులు ugcnet.nta.nic.in. వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
రిజల్ట్ చెక్ చేసుకోవడం ఎలా?
2023 యూజీసీ నెట్ రాసిన విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడం కోసం ముందుగా..
- యూజీసీ నెట్ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.nic.in ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీపై కనిపించే UGC NET June 2023 results లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ నెంబర్, డేటాఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ లను ఎంటర్ చేయాలి.
- స్క్రీన్ పై మీ స్కోర్ కార్డ్ కనిపిస్తుంది. ఆ స్కోర్ కార్డ్ ను చెక్ చేసుకుని, డౌన్ లోడ్ చేసుకోవాలి.
- భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ ను ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.