తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eapcet 2024 Free Tests : తెలంగాణ ఈఏపీసెట్‌ కు ప్రిపేర్ అవుతున్నారా..? ఫ్రీగా ఇలా 'మాక్‌ టెస్టులు' రాసుకోవచ్చు

TS EAPCET 2024 Free Tests : తెలంగాణ ఈఏపీసెట్‌ కు ప్రిపేర్ అవుతున్నారా..? ఫ్రీగా ఇలా 'మాక్‌ టెస్టులు' రాసుకోవచ్చు

14 April 2024, 18:06 IST

    • TS EAPCET (EAMCET) 2024 Updates :టీఎస్ ఈఏపీసెట్‌ కు దరఖాస్తు చేశారా..? అయితే మీరు ఉచితంగా మాక్ టెస్ట్ లు రాసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు అవకాశాన్ని కల్పించారు అధికారులు. ఈ పరీక్షలను ఎలా రాయాలో ఇక్కడ చూడండి…..
తెలంగాణ ఎంసెట్ మాక్ టెస్టులు
తెలంగాణ ఎంసెట్ మాక్ టెస్టులు

తెలంగాణ ఎంసెట్ మాక్ టెస్టులు

TS EAPCET 2024 Mock Tests Updates : తెలంగాణ ఈఏపీసెట్‌(TS EAPCET 2024 Registration) కు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈసారి మూడు లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు అప్లయ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే గతేడాదితో పోల్చితే…ఈసారి ఇంజినీరింగ్ కోర్సులకు తెగ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అయితే మంచి కాలేజీ అనేది చాలా ముఖ్యం.

టాప్ కాలేజీలో సీటు రావాలంటే.. మాత్రం తెలంగాణ ఈఏపీసెట్‌లో(TS EAPCET 2024 Registration) మంచి ర్యాంకును సాధించాల్సి ఉంటుంది. ఇందుకోసం సన్నద్ధం అవుతున్నప్పటికీ…. పరీక్షా విధానం, ప్రశ్నాల సరళి, సమయాభావంతో పాటు మరిన్ని విషయాలు తెలియాలంటే…మాక్ టెస్టులు రాయటం మంచింది. ఇలా రాయటంతో అనేక అంశాలు మీకు కలిసివచ్చే అవకాశం ఉంటుంది.

తెలంగాణ ఈఏపీసెట్‌ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం అధికారులు ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి, జెన్టీయూ హైదరాబాద్ చర్యలు తీసుకుంది. ఈ ఏడాది ఈ ప్రవేశ పరీక్షలు హైదరాబాద్ జెన్టీయూ నిర్వహిస్తు్నన సంగతి తెలిసిందే. ఈ మాక్ టెస్టులను ఎలా రాయాలో ఇక్కడ చూడండి…

ఇలా మాక్ టెస్టులు రాసుకోవచ్చు….

  • తెలంగాణ ఈఏపీసెట్‌ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో పైన కనిపించే Mock Test అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ Engineering (E) - English and Telugu, Engineering (E) - English and Urdu, Agriculture and Pharmacy (A & P) - English and Telugu, Agriculture and Pharmacy (A & P) - English and Urdu ఆప్షన్లు కనిపిస్తాయి.
  • మీరు ఏ స్ట్రీమ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆ లింక్ పై క్లిక్ చేయాలి. అలా చేస్తే సైన్ ఇన్ ఆప్షన్ వస్తుంది. దానిపై కూడా క్లిస్ చేస్తే… మీకు ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది.

తదుపరి వ్యాసం