AP EAPCET - 2022: ఈఏపీసెట్‌లో ఇంటర్ వెయిటేజీ రద్దు.. ఇకపై ఆ మార్కులే కీలకం-inter weightage cancellation in ap eapcet 20222023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Eapcet - 2022: ఈఏపీసెట్‌లో ఇంటర్ వెయిటేజీ రద్దు.. ఇకపై ఆ మార్కులే కీలకం

AP EAPCET - 2022: ఈఏపీసెట్‌లో ఇంటర్ వెయిటేజీ రద్దు.. ఇకపై ఆ మార్కులే కీలకం

HT Telugu Desk HT Telugu

ఏపీ ఈఏపీసెట్‌ 2022–23 లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీని రద్దు చేశారు. సెట్ లో వచ్చిన మార్కులనే పూర్తిగా వందశాతం వెయిటేజీ కింద తీసుకోనున్నారు. ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు.

ఏపీ ఈఏపీసెట్‌ 2022 - 2023

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్‌ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి పూర్తిగా ఇంటర్‌ మార్కుల వెయిటేజీని రద్దు చేశారు. సెట్‌లో వచ్చిన మార్కులనే పూర్తిగా వందశాతం వెయిటేజీ కింద తీసుకోనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి వివరాలను వెల్లడించింది.

గతంలో 25 శాతం..

ఏపీ ఈఏపీసెట్‌లో ఇప్పటివరకు ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండేది. ఈఏపీసెట్‌లోని మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటించేవారు. అయితే కొవిడ్ కారణంగా ఇంటర్ తరగతుల నిర్వహణలో ఇబ్బందులు వచ్చాయి. ఇంటర్‌ విద్యార్థులకు గతేడాది పరీక్షల నిర్వహణలేక వారిని ఆల్‌పాస్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. 2021–22 ఈఏపీ సెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. కాకపోతే మార్కుల బెటర్‌మెంట్‌ కోసం వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం (2022–23)లో కూడా ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలా? వద్దా అనే అంశంపై ఉన్నత విద్యామండలి ఇటీవల సర్కార్ కు లేఖ రాసింది. దీనిని అనంతరం.. సెట్‌లో వచ్చిన మార్కులకే వందశాతం వెయిటేజీ ఇచ్చి వాటి మెరిట్‌ ఆధారంగా ర్యాంకులు ప్రకటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.

పరీక్షల తేదీలు…

ఏపీ ఈఏపీసెట్‌కు ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. మే 10వ తేదీతో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు ముగియగా మొత్తం 2.60 లక్షల మంది దరఖాస్తు చేశారు. జూలై 4 నుంచి 8 వరకు పది సెషన్లలో ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ విద్యార్థులకు.. జూలై 11, 12 తేదీల్లో నాలుగు సెషన్లలో బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
 

నోట్: ఏపీ ఈఏపీసెట్‌ కు సంబంధించిన వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

సంబంధిత కథనం