తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jodo Yatra In Telangana : తెలంగాణలోకి జోడో యాత్ర - 16 రోజులు, 375 కి.మీ

Jodo Yatra in Telangana : తెలంగాణలోకి జోడో యాత్ర - 16 రోజులు, 375 కి.మీ

HT Telugu Desk HT Telugu

23 October 2022, 7:54 IST

    • Bharat jodo yatra in Telangana: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇవాళ తెలంగాణలోకి ప్రవేశించింది. దేశవ్యాప్తంగా తలపెట్టిన ఈ పాదయాత్రలో భాగంగా తెలంగాణలోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.
తెలంగాణలోకి జోడో యాత్ర
తెలంగాణలోకి జోడో యాత్ర (twitter)

తెలంగాణలోకి జోడో యాత్ర

Bharat Jodo Yatra in Telangana: కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే లక్ష్యంతో రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కర్ణాటకతో పాటు ఏపీలో ముగిసింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగే యాత్ర తెలంగాణలోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగనుంది. ఇవాళే (అక్టోబర్ 23) తెలంగాణలోకి జోడో యాత్ర ప్రవేశించింది.ఈ నేపథ్యంలో అగ్రనేతకు ఘన స్వాగతం పలికారు.

ట్రెండింగ్ వార్తలు

TG ITI Admissions 2024 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Karimnagar Tourism : చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు - కరీంనగర్ జిల్లాలో చూడాల్సిన ప్రాంతాలివే..!

19 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

375 కిలో మీటర్లు...7 పార్లమెంట్ స్థానాలు

jodo yatra in telangana route map: కర్ణాటకలోని రాయచూర్ నుంచి ఆదివారం ఉదయం 10 గంటలకు తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లా, గూడబెల్లూరులో అడుగుపెట్టనుంది. ఈ మేరకు టీపీసీసీ ఘన ఏర్పాట్లు చేసింది. గూడబెల్లూరులో అల్పాహారం అనంతరం మధ్యాహ్నం నుండి యాత్ర దీపావళి నిమిత్తం మూడు రోజులపాటు అంటే 26వ తేది వరకు బ్రేక్ తీసుకోనుంది. అనంతరం 27 తేదీ ఉదయం గూడబెల్లూరులో ప్రారంభం కానున్న యాత్ర మక్తల్ చేరుకుని తెలంగాణాలో సుదీర్ఘంగా 16 రోజులపాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగుతుంది. అంతరం నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించనుంది. 16 రోజుల యాత్రలో దీపావళికి మూడు రోజులు, నవంబర్ 4న ఒకరోజు సాధారణ బ్రేక్ తీసుకోనున్న యాత్ర తదనంతరం 12 రోజులపాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. కొన్ని ప్రాంతాల్లో కార్నిర్ మీటింగులు, మరికొన్ని ప్రాంతాల్లో ఉదయపు అల్పాహారం, మరికొన్ని ప్రాంతాలలో నైట్ హాల్ట్ లు చేస్తూ రాహుల్ గాంధీ రోజుకు 20 నుంచి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్రతో ముందుకు సాగనున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో ఒకరోజు నైట్ హాల్ట్ చేయనుండగా నెక్లెస్ రోడ్ లో కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు.

ఈ అసెంబ్లీ స్థానాల మీదుగా...

తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గంలో అడుగుపెట్టే పాదయాత్ర, నారాయణ్ పేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, రాజేంద్ర నగర్, బహుదూర్ పుర, చార్మినార్, గోషా మహల్, నాంపల్లి, ఖైతరాబాద్, కూకట్ పల్లి, శేరిలింగపల్లి, పటాన్ చెరువు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్ ఖేడ్, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మహబూబ్ నగర్, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగనుంది. ఇక నాలుగు రాష్ట్రాలను దాటుతూ వచ్చిన రాహుల్ పాదయాత్రలో అతిపెద్దనగరంగా హైదరాబాద్ ప్రవేశించనుండగా నగరంలో ఆరాంఘర్, చార్మినార్, మోజాంజాహి మార్కెట్, గాంధీ భవన్, నాంపల్లి దర్గా, విజయనగర్ కాలనీ, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్ చెరువు, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, జోగిపేట, పెద్ద శంకరం పేట, మద్కూర్ మీదుగా కొనసాగనుంది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు టీపీసీసీ విసృత ఏర్పాట్లు చేయనుంది. పలు బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నర్ సమావేశాల్లో కాంగ్రెస్ బలాన్ని నిరూపించుకునే విదంగా ప్రత్యేక కార్యక్రమాలతోపాటు పాదయాత్రలో అనుసరించాల్సిన విధి విదానాలతోపాటు రూట్ మ్యాప్ పై పీసీసీ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. సీనియర్ నేతలు సారథ్యం వహించనున్న ఈ 10 కమిటీలతో పాదయాత్ర పొడవునా యాత్రను సమన్వయం చేసుకుంటూ రాహుల్ గాంధితో కలిసి ముందుకు సాగనున్నారు. మునుగోడు ఉపఎన్నికతో పాటు రాహుల్ యాత్రను సమన్వయం చేసుకునేలా తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.

తదుపరి వ్యాసం