Sonia Gandhi joins Bharat Jodo Yatra : భారత్​ జోడో యాత్రలో సోనియా గాంధీ-sonia gandhi joins bharat jodo yatra today in karnataka ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sonia Gandhi Joins Bharat Jodo Yatra Today In Karnataka

Sonia Gandhi joins Bharat Jodo Yatra : భారత్​ జోడో యాత్రలో సోనియా గాంధీ

Sharath Chitturi HT Telugu
Oct 06, 2022 10:31 AM IST

Sonia Gandhi joins Bharat Jodo Yatra : కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. భారత్​ జోడో యాత్రలో పాల్గొన్నారు. కర్ణాటక మాండ్య విధుల్లో రాహుల్​ గాంధీతో పాటు ఇతర నేతలతో కలిసి నడిచారు.

భారత్​ జోడో యాత్రలో భాగంగా రాహుల్​ గాంధీతో సోనియా
భారత్​ జోడో యాత్రలో భాగంగా రాహుల్​ గాంధీతో సోనియా (PTI)

Sonia Gandhi joins Bharat Jodo Yatra today : కాంగ్రెస్​ చేపట్టిన భారత్​ జోడో యాత్రలో.. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం పాల్గొన్నారు. తనయుడు రాహుల్​ గాంధీ, ఇతర నేతలతో కలిసి కర్ణాటకలోని మాండ్య జిల్లాలో కొన్ని కిలోమీటర్లు నడిచారు. సోనియా రాకతో భారత్​ జోడో యాత్రలో సందడి వాతావరణం నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​తో పాటు ఇతర రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు.. సోనియా, రాహుల్​ గాంధీలతో కలిసి నడిచారు. కాంగ్రెస్​ అధ్యక్షురాలిని చూసేందుకు తరలివచ్చిన అభిమానులు, ప్రజలను పోలీసు సిబ్బంది నియంత్రించడంలో చాలా ఇబ్బంది పడినట్టు కనిపిస్తోంది.

<p>భారత్​ జోడో యాత్రలో సోనియా గాంధీ</p>
భారత్​ జోడో యాత్రలో సోనియా గాంధీ (ANI)

చాలా కాలానికి..

తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడిన సోనియా గాంధీ.. చాలా నెలల తర్వాత తొలిసారి బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు.

Sonia Gandhi Bharat Jodo Yatra : రెండుసార్లు కొవిడ్​ సోకడంతో కొన్ని రోజుల పాటు సోనియా ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. చివరిసారిగా.. 2016 ఆగస్టులో వారణాసిలో జరిగిన రోడ్​షోలో బహిరంగంగా ప్రజల ముందు కనిపించారు సోనియా గాంధీ. అక్కడ ఆమె భుజానికి గాయం కావడంతో అనంతరం శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత పలు ఈవెంట్లలో పాల్గొన్నా.. పెద్దగా మాట్లాడలేదు. ఇక అనారోగ్య సమస్యలతో ఎన్నికలు, ప్రచారాలకు సైతం దూరంగానే ఉంటున్నారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు.

<p>రాహుల్​ గాంధీతో సోనియా గాంధీ</p>
రాహుల్​ గాంధీతో సోనియా గాంధీ (ANI)

భారత్​ జోడో యాత్ర..

Bharat Jodo Yatra in Karnataka : 3570కి.మీ భారత్​ జోడో యాత్ర సెప్టెంబర్​ 8న కన్యాకుమారిలో ప్రారంభమైంది. ప్రస్తుతం కర్ణాటకలో యాత్ర కొనసాగుతోంది. కశ్మీర్​ వరకు ఈ యాత్ర ఉండనుంది. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. ముందుండి పార్టీ​ నేతలను నడిపిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడం కోసమే ఈ యాత్ర తలపెట్టింది కాంగ్రెస్​.

ఇక కర్ణాటకలో యాత్రకు విశేష స్పందన లభిస్తోందని కాంగ్రెస్​ నేతలు చెబుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతంలో.. కాంగ్రెస్​కు ఇంతటి మద్దతు లభిస్తుండటం.. మార్పునకు చిహ్నం అని అంటున్నారు.

<p>భారత్​ జోడో యాత్ర కోసం తరలివెళ్లిన ప్రజలు</p>
భారత్​ జోడో యాత్ర కోసం తరలివెళ్లిన ప్రజలు
IPL_Entry_Point

సంబంధిత కథనం