తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts E-challan Discount : ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జీవో విడుదల - ఇవాళ్టి నుంచే క్లియర్ చేసుకోవచ్చు

TS e-Challan Discount : ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జీవో విడుదల - ఇవాళ్టి నుంచే క్లియర్ చేసుకోవచ్చు

26 December 2023, 15:45 IST

    • Telangana e-Challan Discount Updates : పెండింగ్ ట్రాఫిక్ చల్లన్ రాయితీ పై జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఈ అవకాశాన్ని పొందవచ్చని పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం

Telangana e-Challan Discount News: తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చల్లాన్ల రాయితీకి సంబంధించి జీవో వచ్చేసింది. డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన జారీ చేసింది. టూ వీలర్స్‌తో పాటు త్రీవీలర్స్ పై 80 శాతం రాయితీని ఇచ్చింది. కార్లతో పాటు ఇతర వాహనాలకు 60 శాతం రాయితీని ప్రకటించింది. ఇక ఆర్టీసీ బస్సులపై 90 శాతం రాయితీని కల్పించింది సర్కార్.

ట్రెండింగ్ వార్తలు

Kakatiya University VC : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ - సర్కార్ ఆదేశాలు

TS SET 2024 Updates : తెలంగాణ సెట్ దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 28 నుంచి పరీక్షలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

హైదరాబాద్ నగరంలోని రాచకొండ,హైదరాబాద్,సైబరాబాద్.... మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్ లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు అన్నీ పట్టణంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులకు చలాన్లను విధిస్తారు.సీసీ కెమెరాల ఆధారంగా రూల్స్ అతిక్రమించిన వారి పై చర్యలు తీసుకుంటారు. తప్పనిసరిగా కొందరి నుంచి చలాన్లను వసూలు చేస్తున్న చాలా మంది మాత్రం చలాన్లను తిరిగి చెల్లించడం లేదు. ఇటీవల కాలంలో పెండింగ్ చలాన్లు పెద్ద సంఖ్యలో చెల్లించకుండా ఉండటంతో పెండింగ్ చలాన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కొవిడ్ కారణంగా వెహికల్స్ ఓనర్స్ పెండింగ్ చలాన్లు చెల్లించపోయారు. కొన్ని వెహికల్స్ పై వాటి వ్యాల్యూ కంటే ఎక్కువ మొత్తం లో చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై కొద్దిరోజుల కిందట తెలంగాణ సర్కార్ రాయితీని ప్రకటించింది.

ఇక గత సంవత్సరం కూడా ఈ అవకాశాన్ని కల్పించింది సర్కార్. చాలా మంది వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కేవలం 40 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వానికి చలాన్ల ద్వారా రూ.300 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. తాజాగా మరోసారి అవకాశం ఇవ్వటంతో… పెండింగ్ చలాన్లు భారీ సంఖ్యలో క్లియర్ అయ్యే అవకాశం ఉంది.

తాాజాగా తెలంగాణ సర్కార్ పేర్కొన్న రాయితీల ప్రకారం… https://echallan.tspolice.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి చలాన్లను క్లియర్ చేసుకోవచ్చు. Vehicle Number ను ఎంట్రీ చేసి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు.

రాయితీ వివరాలు:

టూ వీలర్స్‌, త్రీ వీలర్స్ - 80 శాతం రాయితీ

లైట్ / హెవీ మోటర్ వెహికల్స్ పై - 50 శాతం రాయితీ

ఆర్టీసీ బస్సులపై - 90 శాతం రాయితీ

తదుపరి వ్యాసం