తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Temperatures : అమ్మో ఎండలు.. ఇవాళ 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..!

TS Temperatures : అమ్మో ఎండలు.. ఇవాళ 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..!

HT Telugu Desk HT Telugu

19 April 2023, 21:47 IST

    • Temperatures Updates: రాష్ట్రంలో భానుడి ప్రతాపం క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో మండుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో మండుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో మండుతున్న ఉష్ణోగ్రతలు

Today Telangana Temperatures : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోతతో వేడితో జనం అల్లాడుతున్నారు. ఓవైపు తేలికపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ… ఎండలు ఏ మాత్రం తగ్గటం లేదు. ఉత్తర తెలంగాణలో తీవ్ర వేడిగాలులు వీస్తున్నాయి. ఇక ఏపీలో కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. పలు జిల్లాల్లోని మండలాలకు విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

CM Revanth Reddy : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణ…! కీలక ఆదేశాలు జారీ

TS LAWCET 2024 Updates : టీఎస్ లాసెట్ కు భారీగా దరఖాస్తులు - ఈ సారి 3 సెష‌న్ల‌లో ఎగ్జామ్, ఫైన్ తో అప్లికేషన్లకు ఛాన్స్

TSRTC Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన

Telangana Rains : కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ఇద్దరు మృతి

44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు…

ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్‌ భూపాపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు 44.5 గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తలమడుగు (ఆదిలాబాద్‌) 44.3, కీతవారిగూడెం (సూర్యాపేట జిల్లా) 44.2, వెల్గటూరు (జగిత్యాల) 44.2, కొల్లాపూర్‌ (నాగర్‌కర్నూల్‌ జిల్లా) 44, తాడ్వాయి (ములుగు) 44, గరిమెల్లపాడు (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా), 44, కొమ్మెర (మంచిర్యాల జిల్లా) 43.9, చప్రాలా (ఆదిలాబాద్‌) 43.9, భిక్కనూర్‌ (కామారెడ్డి) 43.8, పజ్జూర్‌ (నల్లగొండ) 43.8, ధర్మసాగర్‌ (హన్మకొండ జిల్లా) 43.8, జైనత్‌ (ఆదిలాబాద్‌) 43.7, పాత కొత్తగూడెం (భద్రాద్రి కొత్తగూడెం) 43.7, సుజాతనగర్‌ (భద్రాద్రి కొత్తగూడెం) 43.7, కొండాపూర్‌ (మంచిర్యాల జిల్లా) 43.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు TSDPS (Telangana State Development Planning Society) వెల్లడించింది. ఇక హైదరాబాద్ నగరంలోనూ భానుడు పంజా విసురుతున్నాడు. మధ్యాహ్నం వేళలో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు.

ఇక ఏపీలో చూస్తే ఎండలు మండుతున్నాయి. ఐఎండీ అంచనాల నేపథ్యంలో ఏపీ విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం 125 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం 40మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు తగినంత స్థాయిలో నీరు తాగాలని చెబుతున్నారు. నేరుగా ఎండ ఇంట్లో పడకుండా జాగ్రత్త పడాలని.. ఈ మేరకు తగిన చర్యలు తీసుకువాలని అంటున్నారు.బయటికు వెళ్లవలసి వస్తే… గొడుగు, టోపీ, సన్‌స్క్రీన్ ధరించాలని అడ్వైజ్ చేస్తున్నారు. కచ్చితంగా బయటకు వెళ్లాల్సి వస్తే సాయంత్రం తర్వాత వెళ్తే బెటర్ అని చెబుతున్నారు.

తదుపరి వ్యాసం