తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Summer: దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు: వేడిగాలుల ప్రమాదం

Summer: దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు: వేడిగాలుల ప్రమాదం

19 April 2023, 12:14 IST

Summer: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో సుమారు 45 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులు వీస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. 

  • Summer: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో సుమారు 45 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులు వీస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. 
ఢిల్లీ, బిహార్, పశ్చిమ బెంగాల్‍తో పాటు చాలా రాష్ట్రాల్లో వేడిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఇప్పటికే హీట్‍వేవ్ వార్నింగ్‍ను వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు జారీ చేసింది. 
(1 / 8)
ఢిల్లీ, బిహార్, పశ్చిమ బెంగాల్‍తో పాటు చాలా రాష్ట్రాల్లో వేడిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఇప్పటికే హీట్‍వేవ్ వార్నింగ్‍ను వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు జారీ చేసింది. (Representative Image (File Photo))
దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా నాలుగో రోజు గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. 
(2 / 8)
దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా నాలుగో రోజు గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. (HT Photo/Sunil Ghosh)
ఢిల్లీతో పాటు వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో తాత్కాలికంగా కాస్త ఉపశమం ఉండొచ్చని తెలిపింది. 
(3 / 8)
ఢిల్లీతో పాటు వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో తాత్కాలికంగా కాస్త ఉపశమం ఉండొచ్చని తెలిపింది. (HT Photo)
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ ఇటీవలే హెచ్చరించింది.
(4 / 8)
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ ఇటీవలే హెచ్చరించింది.(HT Photo)
దేశంలోని మధ్య, తూర్పు, వాయువ్య ప్రాంతాల్లో ఈ కాలంలో ఎక్కువగా వేడిగాలులు వీస్తాయి.
(5 / 8)
దేశంలోని మధ్య, తూర్పు, వాయువ్య ప్రాంతాల్లో ఈ కాలంలో ఎక్కువగా వేడిగాలులు వీస్తాయి.(PTI)
ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు అక్కడి స్థానిక యంత్రాంగాలు సెలవులు ఇచ్చాయి. 
(6 / 8)
ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు అక్కడి స్థానిక యంత్రాంగాలు సెలవులు ఇచ్చాయి. (HT Photo/Sunil Ghosh)
ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతుండేందుకు వాతావరణ మార్పులు కారణమని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండియాతో పాటు పక్క దేశమైన పాకిస్థాన్‍లోనూ ఈ ఏడాది వేసవి చాలా తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 
(7 / 8)
ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతుండేందుకు వాతావరణ మార్పులు కారణమని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండియాతో పాటు పక్క దేశమైన పాకిస్థాన్‍లోనూ ఈ ఏడాది వేసవి చాలా తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. (HT Photo/Keshav Singh)
వడగాల్పుల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ, వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లో అవసరమైతేనే బయటికి రావాలని చెబుతున్నారు. 
(8 / 8)
వడగాల్పుల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ, వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లో అవసరమైతేనే బయటికి రావాలని చెబుతున్నారు. (HT_PRINT)

    ఆర్టికల్ షేర్ చేయండి