తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Crop Damage In Telangana : అకాల వర్షాలు, పంట నష్టంపై సర్కార్ ఫోకస్ - తడిసిన ధాన్యాన్నీ కొంటామని హామీ..!

Crop Damage in Telangana : అకాల వర్షాలు, పంట నష్టంపై సర్కార్ ఫోకస్ - తడిసిన ధాన్యాన్నీ కొంటామని హామీ..!

HT Telugu Desk HT Telugu

22 April 2024, 5:55 IST

    • Crop Damage in Telangana: అకాల వర్షాలు, పంట నష్టంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొనుగోలు కేంద్రాలకు అధికార యంత్రాంగం తరలిరాగా… తడిసిన ధాన్యాన్నీ కొంటామని రైతన్నలకు హామీనిస్తోంది.
అకాల వర్షాలు, పంట నష్టంపై సర్కార్ ఫోకస్!
అకాల వర్షాలు, పంట నష్టంపై సర్కార్ ఫోకస్!

అకాల వర్షాలు, పంట నష్టంపై సర్కార్ ఫోకస్!

Crop Damage in Telangana : తెలంగాణ రైతాంగాన్ని అకాల వర్షాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే కోతలు ప్రారంభం కాగా.. కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చిన ధాన్యం రాసులన్నీ(Crop Damage) రోజుల తరబడి ఎదురుచూపులకే పరిమితం అవుతున్నాయి. ఇంతలోనే అకాల వర్షాలు అందుకోగా.. రాష్ట్ర సర్కారు పంట నష్టాన్ని సీరియస్ గా తీసుకుంది. జిల్లాల్లో తడిసిన ధాన్యం గురించి, అన్నదాతల అవస్థలను పరిశీలించి తగిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఆదేశించడంతో ఆదివారం అధికార యంత్రాంగం కదిలింది. జిల్లాల్లో ఎక్కడెక్కడ వర్షాలు కురిసాయో.. ఎక్కడెక్కడ పంటలు దెబ్బతిన్నాయో వివరాలు సేకరించాల్సందిగా వచ్చిన ఆదేశాల మేరకు అధికారులు కొనుగోలు కేంద్రాల వద్దకు పరుగులు తీశారు. చాలాచోట్లా కొనుగోళ్లు సక్రమంగా జరగక ధాన్యం తడిసి పోగా.. అధికారులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే కురిసిన వర్షాలు, వడగండ్ల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా ప్రభుత్వానికి నివేదిక అందజేయగా.. ఫీల్డ్ సర్వే చేసి, రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసినా, నిబంధనల మేరకు కొనుగోలు చేయాల్సిందేనని సూచించడంతో అధికారులు కొనుగోలు కేంద్రాల బాట పట్టారు.

ట్రెండింగ్ వార్తలు

20 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Karimnagar Politics: కరీంనగర్‌ల ఫ్లెక్సీల కలకలం, పార్టీ ఫిరాయింపు దారులకు వార్నింగ్‌లతో కూడిన ఫ్లెక్సీలు

Warangal Murder: ఆస్తి కోసం వృద్ధుడి దారుణ హత్య! కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు, వరంగల్‌లో ఘోరం

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతల అవస్థలు

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు (Rains in Telangana) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. కాగా ఇప్పటికే శనివారం ఉదయం ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి తదితర జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. ఇదిలాఉంటే రాష్ట్రంలో వరి కోతల సీజన్ నడుస్తుండగా.. ఇప్పటికే చాలామంది కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొని వస్తున్నారు. కానీ చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలకు మిల్లుల అలాట్ మెంట్ పూర్తి కాకపోవడం, మరికొన్ని చోట్లా తేమ, తాలు పేరున కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సాకులు చెబుతుండటంతో కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఫలితంగా చాలాచోట్లా రైతుల ధాన్యమంతా కల్లాల్లోనే ఉండిపోయింది. అంతేగాకుండా కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా బార్దాన్ కూడా టైంకు ఇవ్వకపోవడం, లారీలు రాకపోవడం వల్ల కాంటాలు కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలోనే అకాల వర్షాలు అందుకోవడంతో శనివారం ఉదయం, ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు చాలాచోట్లా కోతకు వచ్చిన వరి నేలవాలగా,, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. నిజామాబాద్, కామారెడ్డి, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ తదితర జిల్లాల్లో వర్ష తీవ్రత కనిపించగా.. ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

కదిలిన అధికార యంత్రాంగం

అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవడం, మామిడి లాంటి పంటలు దెబ్బతినడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంబంధిత జిల్లాల అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. వెంటనే పంట నష్టం వివరాలు సేకరించాల్సిందిగా సూచించింది. దీంతో జిల్లాల్లో కలెక్టర్ల ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్లు ఆదివారం కొనుగోలు కేంద్రాలను విజిట్ చేశారు. సెంటర్లలో రైతులు పడుతున్న ఇబ్బందులతో పాటు కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. వెంటనే ప్రభుత్వానికి నివేదిక కూడా అందించేందుకు చర్యలు చేపట్టారు.

తడిసిన ధాన్యం కూడా కొంటాం: హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్

జోరు ఎండాకాలంలో దంచి కొట్టిన వానల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి పోయింది. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల పరిధిలో కొంతమేర నష్టం వాటిల్లగా.. ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులతో రివ్యూ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేసి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భ:గా రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటామని, ధాన్యం తడిసిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో 207 , హనుమకొండ జిల్లాలో 150 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్ కవర్ లు అందుబాటులో ఉన్నాయని, అకాల వర్షాల దృష్ట్యా ఇంకా అవసరమైన టార్పాలిన్ కవర్ లు సమకూర్చాలని మార్కెటింగ్ శాఖను ఆదేశించినట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు మండల ప్రత్యేక అధికారులను నియమించామని, మిల్లుల వద్ద ధాన్యం దిగుమతికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిగా ఆదేశించినట్లు పేర్కొన్నారు. అకాల వర్షాల దృష్ట్యా రైతులు అధైర్య పడొద్దని, కొనుగోలు కేంద్రాల్లో ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏదైనా సమస్యలుంటే రైతులు కంట్రోల్ రూమ్ నెంబర్ 799 50 50 785 కు సంప్రదించాలని సూచించారు.

(రిపోర్టింగ్ - హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం