తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sri Ram Navami | భద్రాచలంలో అంగరంగ వైభవంగా రాములోరి ఎదుర్కోలు ఉత్సవం

Sri Ram Navami | భద్రాచలంలో అంగరంగ వైభవంగా రాములోరి ఎదుర్కోలు ఉత్సవం

HT Telugu Desk HT Telugu

09 April 2022, 21:17 IST

    • భద్రాచలం సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. ఎదుర్కోలు ఉత్సవం శనివారం వైభవంగా జరిగింది.
భద్రాచలం శ్రీరామ నవమి ఉత్సవాలు
భద్రాచలం శ్రీరామ నవమి ఉత్సవాలు

భద్రాచలం శ్రీరామ నవమి ఉత్సవాలు

భద్రాద్రిలో సీతారామ స్వామి కల్యాణ వేడుకలు ఘనంగా మెుదలయ్యాయి. ఇందులో భాగంగా.. సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు మహోత్సవం కనుల పండువగా జరిగింది. స్వామివారి కల్యాణ మహోత్సవానికి ముందురోజు.. ఎదుర్కోలు మహోత్సవం జరుగుతుంది. ఈ వేడుకకు.. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సీతారాములను వధువరులుగా పేర్కొంటూ ఇరు వర్గాల గోత్రనామాలను పూజర్లు పఠించారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు ఎదుర్కోలు మహోత్సవంలో పాల్గొన్నారు.

ఆదివారం సీతారామచంద్ర స్వామి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తుల కోసం 170 క్వింటాళ్ల తలంబ్రాలు, 2 లక్షల లడ్డూలు సిద్ధం చేసినట్టుగా అధికారులు తెలిపారు.

టాపిక్

తదుపరి వ్యాసం