తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhadrachalam Temple | భద్రాచలం రాములోరి కల్యాణానికి వెళ్తున్నారా? టికెట్ ఇలా బుక్ చేసుకోండి

Bhadrachalam Temple | భద్రాచలం రాములోరి కల్యాణానికి వెళ్తున్నారా? టికెట్ ఇలా బుక్ చేసుకోండి

HT Telugu Desk HT Telugu

03 March 2022, 8:43 IST

    • రాములోరి భక్తులకు గుడ్ న్యూస్ అందింది. భద్రాచలం దేవస్థానం.. సీతారాముల కల్యాణ వేడుక టికెట్లను ఆన్ లైన్ లో పొందొచ్చని తెలిపింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసింది.
భద్రాచలం దేవస్థానం
భద్రాచలం దేవస్థానం

భద్రాచలం దేవస్థానం

 భద్రాచలం సీతారాముల కల్యాణ వేడుక టికెట్లను ఈరోజు నుంచి ఆన్​లైన్​లో పొందవచ్చు. ఈమేరకు ఆలయ ఈవో శివాజీ ప్రకటించారు. ఏప్రిల్​ 10న కల్యాణం, 11న రామయ్య పట్టాభిషేకం కార్యక్రమాలు నిర్వహిస్తారు. కరోనా కారణంగా రెండేళ్లుగా నిరాడంబంరంగా రాములోరి కల్యాణం జరుగుతోంది. అయితే ఈ ఏడాది.. వేడుకలకు భక్తులను అనుమతి ఇస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

TS Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలు, ముఖ్య తేదీలివే

ఏప్రిల్ 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భద్రాచలం సీతారాముల ఆలయంలో రామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కల్యాణ వేడుకను చూడాలనుకునే భక్తులు ఆన్ లైన్లో టికెట్లు పొందవచ్చు. 10వ తేదీన జరిగే రాములోరి కల్యాణాన్ని.. ప్రత్యక్షంగా చూసేందుకు సెక్టర్లుగా విభజించి.. టికెట్ల రేట్ల నిర్దేశించారు. ఇవాటి నుంచి ఆన్ లైన్ పొందవచ్చు. రూ.7,500, రూ.2,500, రూ.2,000, రూ.1,000, రూ.300, రూ.150 టికెట్లు తీసుకొవచ్చని.. ఈవో శివాజీ తెలిపారు.

టికెట్లు కావాలనుకునే భక్తులు ‌www.bhadrachalamonline.com వెబ్‌సైట్‌లో తీసుకోవచ్చు. రూ.7,500 టికెట్‌కు మాత్రం కల్యాణ ఉభయ దాతలకు అనుమతి ఉంటుంది. నేరుగా ఆలయ కార్యాలయంలో కూడా తీసుకోవచ్చు. ఏప్రిల్‌ 11న జరిగే పట్టాభిషేకం పర్వానికి సంబంధించి సెక్టార్‌ ప్రవేశానికి రూ.1,000 టికెట్‌ను ఆన్‌లైన్‌లో తీసుకోవాల్సి ఉంటుంది.

 

తదుపరి వ్యాసం