తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Rains : 24న అల్పపీడనం..! భారీ వర్షాలకు ఛాన్స్ - ఈ జిల్లాలకు హెచ్చరికలు

TS Rains : 24న అల్పపీడనం..! భారీ వర్షాలకు ఛాన్స్ - ఈ జిల్లాలకు హెచ్చరికలు

23 July 2023, 7:08 IST

    • Telangana Rains: తెలంగాణలో వరుసగా నాలుగో రోజూ వర్షాలు కొనసాగాయి.ఖమ్మం, నల్గొండ జిల్లాలను మినహాయించి.. శనివారం అన్ని జిల్లాల్లో వర్షం పడింది. ఇదిలా ఉంటే.. ఈనెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణకు వర్ష సూచన

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచేస్తున్నాయి. నాలుగు రోజుల్లోనే కావాల్సినంత వర్షం పడటంతో ప్రాజెక్టులకు భారీ ఎత్తున నీరు చేరింది. దాదాపు అన్ని ప్రాజెక్టులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. అయితే మరోసారి తెలంగాణకు అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈనెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈనెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, ముల్లుగు, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 30- 40 కి.మీ వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది.

ఇక ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు చూస్తే,,,, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతారణ కేంద్రం తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం వరకు ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది.

అతి భారీ వర్షాలు…!

మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా త్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో ఎక్కువగా కురిసే ఛాన్స్ ఉంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి

మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ శ్రీకాకుళం,మన్యం, విజయనగరం, అల్లూరి, తూ.గో, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, వైయస్ఆర్, అన్నమయ్య, కర్నూల్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఆదివావం గోదావరికి వరద ఉధృతి పెరిగినట్లు పేర్కొంది. ఉదయం భద్రాచలం వద్ద నీటిమట్టం 43.2 అడుగులు ఉండగా… పోలవరం వద్ద 11.6 మీటర్లకు నీటిమట్టం చేరింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.89 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇవాళ్టి నుంచి ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

తదుపరి వ్యాసం