తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kothagudem : బెడిసి కొట్టిన వ్యూహం..! కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ పై వీగిపోయిన అవిశ్వాసం

Kothagudem : బెడిసి కొట్టిన వ్యూహం..! కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ పై వీగిపోయిన అవిశ్వాసం

HT Telugu Desk HT Telugu

19 February 2024, 21:14 IST

    • Kothagudem latest News:కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. కౌన్సిలర్లు బల నిరూపణకు హాజరు కాకపోవడంతో తీర్మానం వీగిపోయింది.
కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ పై వీగిపోయిన అవిశ్వాసం..
కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ పై వీగిపోయిన అవిశ్వాసం..

కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ పై వీగిపోయిన అవిశ్వాసం..

Kothagudem latest News: కొత్తగూడెం మిన్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం విషయంలో కాంగ్రెస్ వ్యూహం బెడిసి కొట్టింది. ఆమడ దూరం నుంచి అల్లుడు వస్తే మంచం కింద ఇద్దరు, గోడ మూల ముగ్గురు దాసుకున్నారంట అన్న సామెత చందంగా ఉంది కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం. అవిశ్వాసం ప్రవేశ పెట్టిన కౌన్సిలర్లు బల నిరూపణకు హాజరు కాకపోవడంతో తీర్మానం వీగిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

BRS Mlc Election Burden: బీఆర్​ఎస్ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ భారమంతా ‘పల్లా’పైనే! సహకరించని గులాబీ​ నేతలు

Warangal Naimnagar Bridge : నయీంనగర్ బ్రిడ్జి పనుల పూర్తికి టైమ్ ఫిక్స్ - జూన్​ 15 డెడ్ లైన్​..!

AP TS Funeral Disputes: తెలుగు రాష్ట్రాల్లో ఆస్తి గొడవలతో ఆగిన అంత్యక్రియలు, ఆస్తుల కోసం అమానవీయ ఘటనలు

చైర్ పర్సన్ పని తీరు మాకు నచ్చనేలేదంటూ 22 మంది కౌన్సిలర్లు హడావుడి చేసి కలెక్టర్ ను కలిసి లిఖితపూర్వకంగా చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేలా చేశారు. కానీ నేడు అవిశ్వాస తీర్మానం కోసం మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ సమక్షంలో తీర్మానానికి మాత్రం హాజరు కాలేదు. ఈ సమావేశానికి ఉదయం సమయం కేటాయించగా మధ్యాహ్నం 12 గం వరకు ఎవ్వరూ రాకపోవడంతో మళ్ళీ 1.30 గం మరోసారి అవకాశం కల్పించారు. ఆ సమయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సభ్యుల్లో ఒక్కరు కూడా రాక పోవడంతో కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మీ పై అవిశ్వాసం ప్రవేశపెట్టిన 22 మంది కౌన్సిలర్ల తీర్మానం నేడు హాస్యాస్పదంగా వీగిపోయింది. ఈ సందర్భంగా ఆర్డీవో మధు మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ పై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఒక్క కౌన్సిలర్ మాత్రమే రావడంతో కోరం కు సరిపడా సభ్యులు రాకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రకటించారు.

ఇక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీఆర్ఎస్ దే పై చేయి అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ లో ఉంటూ బీఆర్ఎస్ ఓటమికి కారణమైన నాయకులు కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ గెలుపుకు ఎలా పని చేస్తారు అంటూ ఛలోక్తులు విసురుతున్నారు. మొత్తానికి చైర్పర్సన్ పెట్టిన అవిశ్వాసం దీనిని చూస్తుంటే కౌన్సిలర్లు ఊసరవెల్లి రాజకీయాలు చేసినట్టు తెలుస్తుంది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

తదుపరి వ్యాసం