తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Collector: మత్తు పదార్థాల అమ్మకాలు, రవాణాపై నిఘాకు కలెక్టర్ ఆదేశాలు

Medak Collector: మత్తు పదార్థాల అమ్మకాలు, రవాణాపై నిఘాకు కలెక్టర్ ఆదేశాలు

HT Telugu Desk HT Telugu

18 January 2024, 8:00 IST

    • Medak Collector: జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులను కలెక్టర్ రాజర్షి షా అదేశించారు.
మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్ కలెక్టర్ రాజర్షి షా

మెదక్ కలెక్టర్ రాజర్షి షా

Medak Collector: జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలని, పాఠశాల , కళాశాలల, యువత పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి మెదక్‌ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను కోరారు.

ట్రెండింగ్ వార్తలు

Road Accident: ఓటేయడానికి వెళుతూ యాక్సిడెంట్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి, జనగామలో హైవేపై విషాదం

Adilabad Rains: అకాల వర్షాలకు ఆదిలాబాద్‌లో అపార పంట నష్టం, ధాన్యం తడిచిపోవడంతో రైతుల ఆందోళన

Medak Thunderstrom: మెదక్ జిల్లాలో అకాల వర్షం… పిడుగు పాటుతో తాత మనుమడి మృతి, ధాన్యం కాపాడుకునే ప్రయత్నంలో విషాదం

Hyd Bike Blast: హైదరాబాద్‌లో ఘోరం, బైక్‌‌లో మంటలు ఆర్పుతుండగా భారీ పేలుడు, పలువురికి తీవ్ర గాయాలు

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ పారిశ్రామిక ప్రాంతాల్లో పని చేస్తున్న వారి నిఘా పెట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, కిరణా షాపులు, మెడికల్ షాపు ల పై నిఘా పెంచాలని, పాన్ షాపులను పరిశీలించాలని, కిరణా షాపు లలో అమ్మే చాక్లెట్స్ , ఇతర తిను బండారాలను పరిశీలించాలని సూచించారు.

పారిశ్రామిక ప్రాంతాల్లో అధికారులు పర్యటించాలని, మెడికల్ షాపుల దగ్గర సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారు. మత్తు పదార్ధాలు, చాకోలెట్స్, ఇతర తినుబండారాల రూపాల్లో అమ్మతున్నారని అయన అన్నారు.

గంజాయి సాగు చేస్తే చర్యలు

జిల్లాలో ఎవరైనా గంజాయి సాగు చేస్తూ పట్టుబడ్డ, గంజాయి రవాణా చేస్తూ దొరికిపోయిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

యువత తెలిసి తెలియక మత్తుకు బానిసై బంగారం లాంటి భవిష్యత్తు ను నాశనం చేసుకోవద్దు అన్నారు. యువత డ్రగ్స్ , కొకైన్ ,గంజాయి లాంటి మత్తు పదార్థాల వల్ల చాలా అనర్ధాలు కలుగుతాయి అన్నారు.

మత్తు పదార్ధాలకు బానిసలైన వారు అనారోగ్యం గురవుతున్నారని, మానసిక ప్రశాంతతను కోల్పోతున్నరాని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. తల్లి తండ్రుల కూడా తమ పిల్లల ప్రవర్తన ను గమనిస్తుండాలని, పిల్లల ప్రవర్తన లో మార్పు కనిపిస్తే పోలీస్ శాఖ వారిని సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్, అదనపు ఎస్పీ మహేందర్, డిఇఓ రాధా కిషన్, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

తదుపరి వ్యాసం