తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Tour From Hyd: త్రివేండ్రం, కొచ్చి ట్రిప్.. ఈ ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ చూడండి

IRCTC Tour From HYD: త్రివేండ్రం, కొచ్చి ట్రిప్.. ఈ ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ చూడండి

28 September 2022, 12:03 IST

    • irctc tour package from hyd: హైదరాబాద్ నుంచి త్రివేండ్రం, కొచ్చితో పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
హైదరాబాద్ - త్రివేండ్రం టూర్
హైదరాబాద్ - త్రివేండ్రం టూర్ (www.irctctourism.com)

హైదరాబాద్ - త్రివేండ్రం టూర్

irctc tourism announced kerala tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి కేరళలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'KERALA DELIGHTS EX HYDERABAD' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో త్రివేండం, కొచ్చి, అలెప్పీ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

Medak Crime News : దారుణం.. బెట్టింగ్‌ ఆడుతున్నాడని కుమారుడిని రాడుతో కొట్టి చంపిన తండ్రి

TS EAPCET 2024 Key : తెలంగాణ ఎంసెట్ అప్డేట్స్ - ఇంజినీరింగ్ స్ట్రీమ్ 'కీ' కూడా వచ్చేసింది, ఇదిగో డైరెక్ట్ లింక్

hyderabad trivandrum tour dates: అక్టోబర్ 2తో పాటు 7వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి ఆదివారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. ఆయా తేదీల్లో ఆసక్తి ఉన్నవారు వెళ్లొచ్చు. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. AIR PACKAGE ద్వారా అందుబాటులో ఉంది.

Day 01 - Hyderabad - Kochi

ఉదయమే శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కొచ్చి విమానాశ్రయం చేరుకుంటారు. హెటల్ లోకి చెకిన్ అవుతారు. కొచ్చి ఫోర్టు, డచ్చ్ ప్యాలెస్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్, సాయంత్రం బీచ్ కి వెళ్తారు. రాత్రి భోజనం తర్వాత కొచ్చిలోనే బస చేస్తారు.

Day 02 - Kochi - Munnar

బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుతారు. అక్కడ్నుంచి మున్నార్ కు వెళ్తారు. మార్గమధ్యలో చియాపార వాటర్ ఫాల్స్ కు వెళ్తారు. మళ్లీ హోటల్ లోకి చెకిన్ అవుతారు. సాయంత్రం టీ మ్యూజియం చూసిన తర్వాత రాత్రి మున్నార్ లోనే బస చేస్తారు

Day 03 - Munnar

బ్రేక్ ఫాస్ట్ తర్వాత మున్నార్ లోని పలు ప్రాంతాలను చూస్తారు. మెట్టుపట్టీ డ్యామ్ కు వెళ్తారు. ఏకో పాయింట్, కుండ్లా డ్యామ్ లేక్ చూస్తారు. రాత్రి మున్నార్ లోనే బస చేస్తారు.

Day 04 - Munnar - Thekkady

హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత తెక్కడికి వెళ్తారు. Spice Plantationకి వెళ్తారు. తిరిగి హోటల్ కి వెళ్తారు. రాత్రి తెక్కడిలోనే బస చేయాల్సి ఉంటుంది.

Day 05 - Thekkady - Alleppey

బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అలెప్పీకి బయల్దేరుతారు. హోస్ బోట్ లో లంచ్ ఉంటుంది. రాత్రి అలెప్పీలోనే బస చేస్తారు.

Day 06 - Alleppey - Trivandrum

అలెప్పీ నుంచి త్రివేండ్రం వెళ్తారు. మార్గమధ్యలో జతయూ ఎర్త్ సెంటర్ కి వెళ్తారు. అనంతరం త్రివేండ్రం వెళ్తారు. రాత్రి కూడా ఇక్కడే బస చేస్తారు.

Day 07: Trivandrum

ఉదయం త్రివేండ్రం లోని అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత నపీర్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. సాయంత్రం త్రివేండ్రం విమానాశ్రయం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

టూర్ ధరలివే....

kerala tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 50,800 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 36,500 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.33,550గా ఉంది. కంఫార్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి.

<p>ధరల వివరాలు</p>

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం