తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Tour: ఐఆర్‌సీటీసీ ' మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్' ట్రిప్ - ప్యాకేజీ ఇదే

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ ' మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్' ట్రిప్ - ప్యాకేజీ ఇదే

08 October 2022, 18:14 IST

    • hyd - madhyapradesh tour package:హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
హైదరాబాద్ మధ్యప్రదేశ్ టూర్,
హైదరాబాద్ మధ్యప్రదేశ్ టూర్, (HT)

హైదరాబాద్ మధ్యప్రదేశ్ టూర్,

irctc tourism madhyapradesh jyotirlinga tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘MADHYA PRADESH JYOTIRLINGA DARSHAN’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. భోపాల్, సాంచి, ఉజ్జయిని, ఓంకారేశ్వర్ ప్రాంతాలు కవర్ అవుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.....

ట్రెండింగ్ వార్తలు

Medak Thunderstrom: మెదక్ జిల్లాలో అకాల వర్షం… పిడుగు పాటుతో తాత మనుమడి మృతి, ధాన్యం కాపాడుకునే ప్రయత్నంలో విషాదం

Hyd Bike Blast: హైదరాబాద్‌లో ఘోరం, బైక్‌‌లో మంటలు ఆర్పుతుండగా భారీ పేలుడు, పలువురికి తీవ్ర గాయాలు

Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

hyderabad - mp tour: ప్రస్తుతం ఈ టూర్ అక్టోబర్ 19వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Day 1- Wednesday: ప్రయాణికులు కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోవాలి. సాయంత్రం 04. 40 నిమిషాలకు (Sampark Kranti Express) రైలు ప్రారంభంమవుతుంది.

Day 2- Thursday: ఉదయం 08. 15 నిమిషాలకు భోపాల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. ఇక్కడ సాంచి స్తూపాన్ని దర్శించుకుంటారు. తిరిగి భోపాల్ కు చేరుకుంటారు. ఇక్కడ ట్రైబల్ మ్యూజియం, తాజ్ ఉల్ మసీద్ ను చూస్తారు. రాత్రి భోపాల్ లోనే బస చేస్తారు.

Day 3- Friday: హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత ఉజ్జయినికి బయల్దేరుతారు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఆలయాలను దర్శించుకుంటారు. రాత్రి ఉజ్జయినిలోనే బస చేస్తారు.

Day 4- Saturday: నాల్గోరోజు ఓంకారేశ్వర్ కు చేరుకుంటారు. స్థానికంగా ఉన్న పలు పర్యాటక ప్రాంతాలను చూస్తారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.

Day 5- Sunday: ఐదోరోజు మహేశ్వర్ కు బయల్దేరారు. ఐలాదేవి ఫోర్టును సందర్శిస్తారు. అనంతరం మండు ఫోర్టు చూసిన తర్వాత ఇండోర్ కు బయల్దేరుతారు. అంబేడ్కర్ రైల్వే స్టేషన్ కు చేరుకొని రాత్రి 7 గంటలకు రైలు ఎక్కుతారు.

Day 6- Monday: రాత్రి 10 గంటలకు కాచిగూడకు చేరుకోవటం టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధరలివే…

hyd madhyapradesh tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 32,080 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 18,230 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14,300 గా ఉంది. 3 Tier AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

<p>ధరల వివరాలు</p>

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం