తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Go 111 : జీవో 111 ఎఫెక్ట్... భూములు, ఫ్లాట్ల కొనుగోళ్ల దూకుడుకు బ్రేకులు! తగ్గుతున్న ధరలు

GO 111 : జీవో 111 ఎఫెక్ట్... భూములు, ఫ్లాట్ల కొనుగోళ్ల దూకుడుకు బ్రేకులు! తగ్గుతున్న ధరలు

31 May 2023, 16:34 IST

    • GO 111 Withdraw Updates: జీవో 111 ఎత్తివేత అంశం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆంక్షలను ఎత్తివేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోవటంతో  భూముల ధరలతో పాటు రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్న చర్చ వినిపిస్తోంది. 
జీవో 111 ఎత్తివేత
జీవో 111 ఎత్తివేత

జీవో 111 ఎత్తివేత

GO 111 Withdraw Latest News: 111 జీవో రద్దుకు కేబినెట్ ఆమోదం తెలపటంతో....84 గ్రామాల పరిధిలో సంబరాలు మిన్నంటుతున్నాయి. తమ ప్రాంతం ఇక అభివృద్ధిపథంలో ముందుకు వెళ్తుందని స్థానికులు అభిప్రాయపడుతుంటే.... ప్రతిపక్ష పార్టీలు, పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాలు జీవో 111 ఎత్తివేతను ఖండిస్తున్నాయి. కేవలం రియల్ దందా కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు రద్ద నిర్ణయం ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగంపై గట్టి ప్రభావం పడినట్లు అయింది. భూమలు కొనుగోళ్లు, ఫ్లాట్లు, ఇండ్ల కొనుగోళ్లు దూకుడుకు కూడా బ్రేకులు పడినట్లు అయిందన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

జీవో 111 రద్దు నిర్ణయంతో చాలా ప్రాంతాల్లో రియల్ రంగం డీలాపడిపోయింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఫ్లాట్ల కొనుగోళ్లు పెద్దగా జరగటం లేదు. ఇక నగరంలోని చాలా చోట్ల నిర్మించిన ఫ్లాట్ల అమ్మకాలు కూడా తగ్గిపోయినట్లు నిపుణులు అంచనాలు వేస్తున్నారు. చాలాచోట్ల క్రయవిక్రయాలు కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ వేలం వేస్తున్న భూములకు కూడా ఆదరణ తగ్గిపోయింది. భూములపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు వెనక్కి తగ్గుతున్నారు. ఇక ప్రభుత్వ లెక్కలు చూస్తే... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూములు క్రయ విక్రయాలపై దాదాపు రోజుకు 40 కోట్ల ఆదాయం వస్తే... ప్రస్తుతం 40 కోట్లు వస్తున్నట్లు తెలుస్తోంది. చాలా కొత్త వెంచర్లు ఉండగా.. ప్లాట్లు సేల్స్ కావటం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇన్ సిటీలో అధిక ధరలు ఉండటంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి ఉండటంతో... కొత్తగా కొనేవారి చూపు 84 గ్రామాల వైపు మళ్లిందన్నటాక్ వినిపిస్తోంది. దాదాపు లక్ష ఎకరాల భూమి నిర్మాణ రంగంలోకి వస్తుండటంతో... ఇక్కడ పెట్టుబడులు పెట్టే ఆలోచనలో చాలా మంది ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఆసక్తి చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.

హెచ్ఎండీఏ వేలంపై ఎఫెక్ట్...

గత కొంత కాలంగా శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను వేలం వేస్తోంది హెచ్ఎండీఏ. ఫలితంగా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. పలుచోట్ల గజం ధర లక్ష రూపాయలు దాటిన పరిస్థితులు కూడా కనిపించాయి. ఇప్పుడు చూస్తే వేలంలో అలాంటి స్పందన కనిపించటం లేదు. ఫేజ్ 1లో పరిస్థితితో పోల్చితే ఫేజ్ 2లో కొనుగోళ్లు దారులు ఆసక్తి చూపటం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక కోకాపేటలో కూడా భూముల ధరలు సగానికి పడిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా జీవ 111 ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ రంగంపై గట్టిగా ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది.రాబోయే రోజుల్లో చాలా ప్రాంతాల్లోని ధరలు కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది.

తదుపరి వ్యాసం