తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ibps 2022-23 : బ్యాంక్ జాబ్స్ కు ప్రిపేరవుతున్నారా? జిల్లాకు 30 మంది చొప్పున ఫ్రీ కోచింగ్

IBPS 2022-23 : బ్యాంక్ జాబ్స్ కు ప్రిపేరవుతున్నారా? జిల్లాకు 30 మంది చొప్పున ఫ్రీ కోచింగ్

HT Telugu Desk HT Telugu

26 June 2022, 18:15 IST

    • బ్యాంకు పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా ప్రతి జిల్లా నుంచి 30 మందికిఉచితంగా కోచింగ్‌ ఇవ్వనున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారి కోసం బీసీ స్టడీ సర్కిల్ గుడ్ న్యూస్ చెప్పింది. జిల్లా నుంచి 30 మంది చొప్పున మొత్తం 1000 మందికి ఎంపిక చేసి వారికి కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ కోచింగ్‌లో బీసీలకు 75 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు శాతం, EWSకు 5 శాతం, వీహెచ్ అభ్యర్థులకు 5 శాతం సీట్లు కేటాయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

BRS Protest: బోనస్ బోగసేనా?... రోడ్డెక్కిన బీఆర్ఎస్.. ప్రభుత్వ తీరుపై ధర్నాలు, రాస్తారోకోలతో BRS నిరసన

Hyderabadi In UK Polls: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో సిద్ధిపేట ఐటీ ఇంజనీర్‌, లేబర్ పార్టీ తరపున పోటీ

Graduate Mlc Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై బీజేపీ గురి, కీలక నేతలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు

Warangal Rains: వరంగల్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం, రైతులకు తీవ్ర నష్టం.. గ్రేటర్ లో ఆఫీసర్లు అలర్ట్

కోచింగ్ తీసుకోవాలి అనుకునేవారు. BC స్టడీ సర్కిల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. తర్వాత IBPS 2022-23కి ఉచిత కోచింగ్ ప్రోగ్రామ్‌పై క్లిక్ చేయండి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. కొత్త పేజీ తెరుచుకుంటుంది. పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, కులం, ఆధార్ కార్డ్ వివరాలు, మొబైల్ నంబర్, అర్హతలు మరియు చిరునామాను నమోదు చేయండి. తర్వాత ఫొటోలు, సంతకం, పదో తరగతి మెమో, డిగ్రీ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, నేటివిటీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు కాపీని అప్‌లోడ్ చేయండి.

అభ్యర్థులకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. మరిన్ని వివరాలకు 04024071178, 04027077929 నెంబర్‌కు సంప్రదించాలి. ఐబిపిఎస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు 8,106 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇందులో తెలంగాణలో గ్రామీణ బ్యాంకులో 459 ఆఫీస్ అసిస్టెంట్‌లు, 159 ఆఫీసర్ స్కేల్, ఖాళీలు ఉన్నాయి. జూన్ 27 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

టాపిక్

తదుపరి వ్యాసం