తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Crime | సొంత కూతుళ్లని కూడా చూడని తండ్రి.. ముగ్గురిపై లైంగిక దాడి!

Crime | సొంత కూతుళ్లని కూడా చూడని తండ్రి.. ముగ్గురిపై లైంగిక దాడి!

HT Telugu Desk HT Telugu

21 March 2022, 7:57 IST

    • అతనికి ఐదుగురు సంతానం. అందులో ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆ ఆటో డ్రైవర్​ తాగేసి వచ్చి.. సొంత కూతుళ్లపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారు ఆత్మహత్యకు సైతం ప్రయత్నించారు.
కూతుళ్లపై తండ్రి లైంగిక దాడి
కూతుళ్లపై తండ్రి లైంగిక దాడి

కూతుళ్లపై తండ్రి లైంగిక దాడి

Father assaults daughter | హైదరాబాద్​ వనస్థలిపురంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సొంత కూతుళ్లని కూడా చూడకుండా.. ఓ కిరాతక తండ్రి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డారు!

ట్రెండింగ్ వార్తలు

10 Years Telangana: ఉమ్మడి రాజధాని గడువు మరో పక్షం రోజులే.. జూన్‌2 తర్వాత ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశం

BRS RakeshReddy: బీఆర్ఎస్ లో 'రాకేశ్ రెడ్డి' పంచాయితీ!కోఆర్డినేషన్ మీటింగ్‌ కు ముఖ్య నేతలంతా డుమ్మా

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

ఇదీ జరిగింది..

నల్గొండలోని దేవరకొండకు చెందిన ఓ వ్యక్తి.. ఆటో నడుపుకుంటూ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్​లోని వనస్థలిపురంలో నివాసముంటున్నాడు. అతనికి ఐదుగురు సంతానం. ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. పెద్ద కూతురి వయస్సు 20 ఉంటుంది. ఆ వ్యక్తి నిత్యం మద్యం సేవించి ఇంటికొచ్చి నానా రచ్చ చేసేవాడు. ఈ క్రమంలోనే పలుమార్లు కూతుళ్లపై లైంగిక దాడికి యత్నించాడు. భార్య ఎప్పుడు అడ్డుకునేది.

కాగా.. ఈ నెల 17న తాగేసి వచ్చి.. భార్యని కొట్టాడు. ఆమెను ఊరికి పంపించేశాడు. ఆ తర్వాతి రోజు రాత్రి.. మళ్లీ తాగి ఇంటికెళ్లాడు ఆ ఆటో డ్రైవర్​. తన 13ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించగా.. మిగితా కుమార్తెలు గట్టిగా అరిచారు. చుట్టుపక్కన వారు వస్తారేమో అని భయపడి.. అతను అక్కడి నుంచి పారిపోయాడు.

అయితే.. బాలికలు షీ టీమ్​కు ఫోన్​ చేశారు. కానీ గంటలు గడిచినా ఎలాంటి స్పందన లభించలేదు. తండ్రి చేతుల్లో వేధిపులకు గురికావడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలని భావించారు. సమీప చెరువు వద్దకు కూడా వెళ్లారు. అక్కడే ఓ మహిళ వారిని చూసింది. వారి ఆత్మహత్య ప్రయత్నాలను అడ్డుకుంది. అసలు విషయం తెలుసుకుని ఓ స్వచ్ఛంద సంస్థ ఫోన్​ నెంబర్​ వారికి ఇచ్చింది.

ఆ ముగ్గురు.. స్వచ్ఛంద సంస్థకు కాల్​ చేయగా.. వారు పోలీసులను అప్రమత్తం చేశారు. బాలికలను పోలీసు స్టేషన్​కు తీసుకెళ్లి.. ఫిర్యాదు రాయించుకున్నారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు.. శనివారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల రిమాండ్​లోనే ఉన్నాడు.

తదుపరి వ్యాసం