తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  బాలికపై తండ్రి, సోదరుడు, తాత, మామ అత్యాచారం..!

బాలికపై తండ్రి, సోదరుడు, తాత, మామ అత్యాచారం..!

HT Telugu Desk HT Telugu

19 March 2022, 16:07 IST

    • Crime | మహారాష్ట్రలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్​ బాలికపై ఆమె తండ్రి, సోదరుడు, తాత, మామ అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదేళ్లుగా ఆ బాలిక నరకం అనుభవిస్తోంది.
ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్న బాలిక
ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్న బాలిక (Hindustantimes telugu)

ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్న బాలిక

Girl raped | మహారాష్ట్ర పుణెలో.. మానవజాతి తలదించుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై ఆమె తండ్రి, సోదరుడు, తాత, మామ.. గత ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు.

ఇంత దారుణమా..!

బాధితురాలి కుటుంబం బిహార్​కు చెందినది. పుణెలో ప్రస్తుతం వారు నివాసముంటున్నారు. 2017లో కుటుంబం బిహార్​లో ఉన్నప్పటి నుంచే బాలికపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. 2020 నవంబర్​లో బాలిక సోదరుడు సైతం అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత.. బాలిక తాత, మామ.. పలుమార్లు ఆమెపై అభ్యంతరకర రీతిలో ప్రవర్తించారు.

Pune crime news | ఐదేళ్లుగా బాలిక నరకం అనుభవిస్తోంది. తాజాగా.. ఆమె స్కూలులో జరిగిన ఓ కార్యక్రమంలో బాలిక ఈ విషయాలను బయటపెట్టింది. స్కూలు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 45ఏళ్ల తండ్రి, 11ఏళ్ల సోదరుడిపై సెక్షన్​ 376 కింద కేసు నమోదు చేశారు. 60ఏళ్ల తాత, 25ఏళ్ల దూరపు చుట్టమైన మామపై సెక్షన్​ 354 కింద లైంగిక వేధింపుల కేసు వేశారు. కాగా.. ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్​ చేయలేదు.

అయితే.. ఇది సామూహిక అత్యాచారం కాదని పోలీసులు చెబుతున్నారు. వేరువేరుగా ఘటనలు జరిగాయని, బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నట్టు.. ఒకరి గురించి మరొకరికి తెలిసి ఉండదని అభిప్రాయపడుతున్నారు.

తదుపరి వ్యాసం