తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Nz Live Streaming: ఇండియా, న్యూజిలాండ్‌ తొలి టీ20 ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

ind vs nz live streaming: ఇండియా, న్యూజిలాండ్‌ తొలి టీ20 ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

Hari Prasad S HT Telugu

17 November 2022, 12:28 IST

    • ind vs nz live streaming: ఇండియా, న్యూజిలాండ్‌ తొలి టీ20 ఎప్పుడు, ఎక్కడ చూడాలి? ఈ రెండు టీమ్స్‌ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈ మ్యాచ్‌ శుక్రవారం (నవంబర్‌ 18) వెల్లింగ్టన్‌లో జరగనుంది.
ట్రోఫీతో న్యూజిలాండ్, ఇండియా కెప్టెన్లు కేన్ విలయమ్సన్, హార్దిక్ పాండ్యా
ట్రోఫీతో న్యూజిలాండ్, ఇండియా కెప్టెన్లు కేన్ విలయమ్సన్, హార్దిక్ పాండ్యా (ANI Picture Service)

ట్రోఫీతో న్యూజిలాండ్, ఇండియా కెప్టెన్లు కేన్ విలయమ్సన్, హార్దిక్ పాండ్యా

ind vs nz live streaming: టీ20 వరల్డ్‌కప్‌ చేదు అనుభవాన్ని ఇంకా మరచిపోక ముందే టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. కీలకమైన న్యూజిలాండ్‌ టూర్‌కు వెళ్లిన హార్దిక్‌ కెప్టెన్సీలోని ఇండియన్‌ టీమ్‌.. మొదట మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ శుక్రవారం (నవంబర్‌ 18) నుంచి ప్రారంభం కానుంది. దీని తర్వాత మూడు వన్డేల సిరీస్‌కు శిఖర్ ధావన్‌ కెప్టెన్‌గా ఉంటాడు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

ఈ టూర్‌కు కెప్టెన్‌ రోహిత్‌శర్మతోపాటు విరాట్‌ కోహ్లి, కేఎల్ రాహుల్‌, మహ్మద్‌ షమిలు దూరంగా ఉన్నారు. దీంతో యువకులకు ఇది మంచి అవకాశంగా మారనుంది. టీ20, వన్డే సిరీస్‌లకు వైస్‌ కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌ ఉండనున్నాడు. ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, ఉమ్రాన్‌ మాలిక్, సిరాజ్‌లాంటి యువ ప్లేయర్స్‌కు ఈ సిరీస్‌ బాగా ఉపయోగపడనుంది.

అటు న్యూజిలాండ్‌ కూడా వరల్డ్‌కప్‌ సెమీస్‌లోనే ఓడి ఇంటిదారి పట్టినా.. సొంతగడ్డపై ఆడనుండటం కలిసి రానుంది. కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్సీలోని ఆ టీమ్‌ను వాళ్ల గడ్డపై ఓడించడం అంత సులువు కాదు. ఈ సిరీస్‌కు స్టార్‌ బౌలర్‌ బౌల్ట్‌ దూరంగా ఉండటం ఇండియాకు కాస్త కలిసొచ్చే విషయం.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా ఇదే

హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), పంత్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, చహల్‌, కుల్దీప్‌, సిరాజ్‌, హర్షల్‌, భువనేశ్వర్‌, అర్ష్‌దీప్, ఉమ్రాన్‌ మాలిక్‌

ఇండియా vs న్యూజిలాండ్‌ ఎక్కడ, ఎప్పుడు చూడాలి?

ఇండియా, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ వెల్లింగ్టన్‌లోని స్కై స్టేడియంలో జరుగుతుంది. ఈ సారి ఈ సిరీస్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సొంతం చేసుకోవడం విశేషం. మ్యాచ్‌లన్నీ ప్రైమ్‌ వీడియోలోనే ప్రత్యక్ష్య ప్రసారం అవుతాయి. అంతేకాకుండా డీడీ స్పోర్ట్స్‌లోనూ ఇండియాలో ఈ మ్యాచ్‌లను చూసే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం