Shikhar Dhawan in Double XL: శిఖర్ ధావన్ బాలీవుడ్ ఎంట్రీ.. ఫస్ట్ లుక్ చూశారా?
Shikhar Dhawan in Double XL: టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతడు నటిస్తున్న డబుల్ ఎక్స్‌ఎల్ (Double XL) మూవీ నుంచి ఫస్ట్ లుక్ మంగళవారం (అక్టోబర్ 11) రిలీజైంది.
Shikhar Dhawan in Double XL: ఇండియన్ క్రికెట్ టీమ్‌లో గబ్బర్‌సింగ్‌గా పేరుగాంచిన శిఖర్ ధావన్ ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. డబుల్ ఎక్స్‌ఎల్ అనే మూవీతో అతడు సినిమా అరంగేట్రం చేస్తున్నాడు. తాజాగా మంగళవారం (అక్టోబర్ 11) ఈ మూవీ నుంచి ధావన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, హుమా ఖురేషి నటిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
బాడీ షేమింగ్‌లాంటి సబ్జెక్ట్‌ను కామెడీ జోడించి ఈ సినిమా తీస్తున్నారు. ఈ మూవీతో ధావన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించగా.. ఇప్పుడు హుమాతో ధావన్ కలిసి ఉన్న ఫొటోను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్న హుమా ఖురేషి.. ధావన్ ఫస్ట్ లుక్‌ను తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా రివీల్ చేసింది.
హుమాతో శిఖర్ డ్యాన్స్ చేస్తున్న ఫొటో ఇది. ఇక మరో ఫొటోలో బిహైండ్ ద సీన్స్ ఈ ఇద్దరూ సరదాగా నవ్వుతూ కనిపించారు. "మొత్తానికి సీక్రెట్ బయటకు వచ్చేసింది" అనే క్యాప్షన్‌తో హుమా ఈ ఫొటోలను షేర్ చేసింది. కొన్ని నెలల కిందటే శిఖర్ ధావన్ ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లు చెప్పారు.
ఇక ఈ డబుల్ ఎక్స్‌ఎల్ మూవీతో ధావన్ ఓ గెస్ట్ రోల్‌కే పరిమితం కాకుండా పూర్తిస్థాయి పాత్ర పోషించడం విశేషం. లావుగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు బాడీ షేమింగ్ ఎలా ఎదొర్కొన్నారన్న అంశాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఇందులో రాజశ్రీ త్రివేది పాత్రలో హుమా, సైరా ఖన్నా పాత్రలో సోనాక్షి కనిపిస్తున్నారు. రాజశ్రీ ఓ స్పోర్ట్స్ ప్రెజెంటర్ కావాలని, సైరా ఓ ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కంటారు.
అయితే ఆ క్రమంలో వీళ్లు బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంటారు. సత్రమ్ రమానీ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ముదస్సర్ అజీజ్ స్క్రిప్ట్ అందించాడు. టీ-సిరీస్, వాకావూ ఫిల్మ్స్ బ్యానర్ల కింద భూషణ్ కుమార్, హుమా, క్రిష్ణన్ కుమార్, విపుల్ డి షా, రాజేష్ బెహల్, అశ్విన్ వర్డె, సాకిబ్ సలీమ్, ముదస్సర్ ఈ మూవీని నిర్మించారు.