తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rishabh Pant To Open In T20is: పంత్ ఓపెనింగ్.. రోహిత్ మిడిలార్డర్.. టీమిండియా మాజీ క్రికెటర్ సలహా

Rishabh Pant to Open in T20Is: పంత్ ఓపెనింగ్.. రోహిత్ మిడిలార్డర్.. టీమిండియా మాజీ క్రికెటర్ సలహా

14 September 2022, 7:08 IST

    • Rishabh Pant as Opener: రిషభ్ పంత్‌ను టీ20ల్లో ఓపెనింగ్ పంపిస్తే.. బహుశా అతడు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే అవకాశముందని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ నాలుగో స్థానంలో రావాలని సూచించాడు.
రిషబ్ పంత్-రోహిత్ శర్మ
రిషబ్ పంత్-రోహిత్ శర్మ (AP)

రిషబ్ పంత్-రోహిత్ శర్మ

Rishabh Pant to Open in T20Is: టీ20 ప్రపంచకప్ సమరానికి ఇంకో నెల రోజులు మాత్రమే ఉంది. ఈ పోరుకు భారత్ పూర్తిగా సన్నద్ధమైందా? అంటే మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్నింట్లోనూ బలంగా కనిపిస్తున్నప్పటికీ పరాజయాలు టీమిండియా వెన్నంటే వస్తున్నాయి. ఇందుకు ఇటీవల జరిగిన ఆసియా కప్పే ఉదాహరణ. మిడిలార్డర్‌ బ్యాటర్లు అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. ముఖ్యంగా రిషబ్ పంత్ స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయడంపై బాహటంగానే నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ మాత్రం పంత్‌పై విభిన్నంగా స్పందించాడు. అతడిని ఓపెనర్‌గా పంపాలని సూచించాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

"టీ20ల్లో రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపితే అతడి అత్యుత్తమ ఆట బయటకు వస్తుందని నేను అనుకుంటున్నా. రోహిత్ శర్మ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నా. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌ను ఓపెనింగ్ పంపించి అతడిలో అత్యుత్తమ ఆటను బయటకు తీశాడు. అలాగే ఇప్పుడు పంత్‌లో అత్యుత్తమ ప్రదర్శన రావాలంటే టీ20ల్లో అతడిని ఓపెనింగ్ చేయించాలి. టాప్-5లో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఉండాలని నేను అనుకుంటున్నా." అని వసీం జాఫర్ స్పష్టం చేశాడు.

ఆసియా కప్‌లో రిషభ్ పంత్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతడు తనకిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పటికీ ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో పంత్‌ను తీసుకోలేదు. రవీంద్ర జడేజా గాయం కారణంగా దూరం కావడంతో టాప్-6లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉండాలని తర్వాత అతడిని తీసుకున్నారు. అయినప్పటికీ దినేశ్ కార్తీక్, పంత్‌లో ఒకరిని తుది జట్టులో తీసుకోవాలంటే టీమిండియాకు కఠినమైన సవాల్ ఎదురవుతుంది.

టీ20 ప్రపంచకప్ వచ్చే నెలలో జరగనున్న సందర్భంగా ఆ టోర్నీకి ముందు టీమిండియా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో స్వదేశంలో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనుంది. కాబట్టి ఇందులో రోహిత్, ద్రవిడ్.. ప్రయోగాలు చేసే అవకాశం లేకపోలేదు. టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికైన జట్టుతోనే ఈ రెండు సిరీస్‌లోనే ఆడే అవకాశముంది. ఈ నెల 20 నుంచి అక్టోబరు 4 వరకు ఈ సిరీస్‌లు జరగనున్నాయి. టీ20ల్లో రిషభ్ పంత్ ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. 58 టీ20ల్లో అతడు 23 సగటుతో 934 పరుగులు మాత్రమే చేశాడు.

తదుపరి వ్యాసం