తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli@500: విరాట్ కోహ్లి 499 మ్యాచ్‌లలో సాధించిన ఆరు రికార్డులు ఇవే

Virat Kohli@500: విరాట్ కోహ్లి 499 మ్యాచ్‌లలో సాధించిన ఆరు రికార్డులు ఇవే

Hari Prasad S HT Telugu

20 July 2023, 15:39 IST

    • Virat Kohli@500: విరాట్ కోహ్లి 499 మ్యాచ్‌లలో సాధించిన రికార్డులు ఇవే. అంతర్జాతీయ క్రికెట్ లో 500వ మ్యాచ్ ఆడబోతున్న కోహ్లి.. ఇప్పటి వరకూ ఏ ఘనతలు సొంతం చేసుకున్నాడో ఓసారి చూద్దాం.
క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లి
క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లి (AFP)

క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లి

Virat Kohli@500: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ లో తన 500వ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఇప్పటి వరకూ అన్ని ఫార్మాట్లు కలిపి 499 మ్యాచ్ లు ఆడిన కోహ్లికి.. వెస్టిండీస్ తో గురువారం (జులై 20) నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్ 500వ మ్యాచ్ కావడం విశేషం. మరి అంతర్జాతీయ క్రికెట్ లో ఇంత వరకూ అతడు సాధించిన రికార్డులేంటో ఓసారి చూడండి.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

వన్డే క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగుల వీరుడు

విరాట్ కోహ్లి ఇప్పటి వరకూ 274 వన్డేలు ఆడి 57.32 సగటుతో 12898 రన్స్ చేశాడు. కోహ్లికి ఈ ఫార్మాట్ లో ఉన్నంత సక్సెస్ మరే ఫార్మాట్ లో లేదు. 46 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇండియా తరఫున సచిన్ తర్వాత వన్డేల్లో అత్యధిక పరుగుల లిస్టులో రెండోస్థానంలో ఉన్నాడు.

75 అంతర్జాతీయ సెంచరీలు

అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీల జాబితాలో సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లిదే. కోహ్లి 499 మ్యాచ్ లలో 75 సెంచరీలు చేశాడు. అందులో 46 వన్డేల్లో, 28 టెస్టుల్లో, ఒకటి టీ20 క్రికెట్ లో చేశాడు. సచిన్ 100 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల రన్స్

వన్డే క్రికెట్ లో విరాట్ కోహ్లి అత్యంత వేగంగా 8, 9, 10, 11, 12 వేల పరుగులు చేసి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 175వ ఇన్నింగ్స్ లో 8 వేలు. 194వ ఇన్నింగ్స్ లో 9 వేలు, 205వ ఇన్నింగ్స్ లో 10 వేలు, 222 ఇన్నింగ్స్ లో 11 వేలు, 242 ఇన్నింగ్స్ లో 12 వేల మైలురాయి చేరుకున్నాడు.

టీ20ల్లో అత్యధిక పరుగులు

విరాట్ కోహ్లి టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ అతడు 115 మ్యాచ్ లలో 52.73 సగటుతో 4008 రన్స్ చేశాడు. ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

టీ20 వరల్డ్ కప్‌లలో అత్యధిక పరుగులు

టీ20 వరల్డ్ కప్ లలోనూ కోహ్లి అత్యధిక పరుగులు చేశాడు. 27 వరల్డ్ కప్ మ్యాచ్ లలో 1141 రన్స్ చేయడం విశేషం. 14 హాఫ్ సెంచరీలు సహా ఏకంగా 81.5 సగటుతో రన్స్ చేయడం విశేషం.

క్రికెట్ చరిత్రలో ఆరో అత్యధిక స్కోరర్

క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ లో విరాట్ కోహ్లి ఆరో స్థానంలో ఉన్నాడు. కోహ్లి 499 మ్యాచ్ లలో 53.48 సగటుతో 25461 రన్స్ చేశాడు. 75 సెంచరీలు, 131 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం