తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Asian Games 2023: ఇండియాకు షాక్.. ఏషియన్ గేమ్స్ నుంచి స్టార్ రెజ్లర్ ఔట్

Asian Games 2023: ఇండియాకు షాక్.. ఏషియన్ గేమ్స్ నుంచి స్టార్ రెజ్లర్ ఔట్

Hari Prasad S HT Telugu

15 August 2023, 15:48 IST

    • Asian Games 2023: ఇండియాకు షాక్ తగిలింది. ఏషియన్ గేమ్స్ నుంచి స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఔట్ అయింది. గాయం కారణంగా తాను తప్పుకుంటున్నట్లు ఆమె ట్విటర్ ద్వారా వెల్లడించింది.
రెజ్లర్ వినేష్ ఫోగాట్
రెజ్లర్ వినేష్ ఫోగాట్

రెజ్లర్ వినేష్ ఫోగాట్

Asian Games 2023: ఏషియన్ గేమ్స్ 2023 మహిళల రెజ్లింగ్ లో ఓ గోల్డ్ మెడల్ పక్కాగా సాధించిపెడుతుందనుకున్న వినేష్ ఫోగాట్ షాకింగ్ న్యూస్ చెప్పింది. గాయం కారణంగా తాను ఈ గేమ్స్ లో పాల్గొనడం లేదని వెల్లడించింది. మంగళవారం (ఆగస్ట్ 15) సోషల్ మీడియా ద్వారా ఈ బ్యాడ్ న్యూస్ ను ఆమె అభిమానులతో పంచుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

మోకాలి గాయం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఏషియన్ గేమ్స్ నుంచి తప్పుకోవాల్సి వస్తోంది. ఈ గాయానికి ఆమె సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. 28 ఏళ్ల వినేష్.. 2018 ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. ఈసారి కూడా గోల్డ్ మెడల్ నిలబెట్టుకోవాలన్నది తన కల అయినా.. దురదృష్టవశాత్తూ గేమ్స్ కు దూరం కావాల్సి వస్తోందని వినేష్ వాపోయింది.

"ఈ బాధాకరమైన వార్తను మీతో పంచుకోవాలని అనుకున్నాను. రెండు రోజుల కిందట అంటే ఆగస్ట్ 13న ట్రైనింగ్ లో నా మోకాలికి గాయమైంది. స్కాన్లు, పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ గాయానికి సర్జరీ మాత్రమే మార్గమని డాక్టర్ తేల్చారు. ఆగస్ట్ 17న ముంబైలో సర్జరీ చేయించుకోబోతున్నాను.

2018, జకార్తాలో నేను గెలిచిన గోల్డ మెడల్ ను ఈ ఏషియన్ గేమ్స్ లోనూ నిలబెట్టుకోవాలన్నది నా కల. కానీ దురదృష్టవశాత్తూ ఈ గాయం నన్ను దూరం చేస్తోంది. ఈ విషయాన్ని నేను సంబంధిత అధికారులు తెలిపాను. వాళ్లు నా స్థానంలో ఓ రిజర్వ్ ప్లేయర్ ను ఆసియా గేమ్స్ కు పంపిస్తారు" అని వినేష్ ట్వీట్ చేసింది.

ఏషియన్ గేమ్స్ లోనే కాదు కామన్వెల్త్ గేమ్స్ లోనూ వినేష్ రెండు గోల్డ్ మెడల్స్ గెలిచింది. ఇక వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్ లో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్ఝౌలో జరగనున్నాయి. ఈసారి మొత్తం 40 క్రీడలు, 61 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి.

ఈసారి ఏషియన్ గేమ్స్ లో క్రికెట్ కూడా ఉండనుంది. ఈ క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 19నే ప్రారంభమై, అక్టోబర్ 8 వరకూ జరుగుతాయి. ఇండియన్ క్రికెట్ టీమ్ కు ఈ ఏషియన్ గేమ్స్ లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉన్నాడు.

టాపిక్

తదుపరి వ్యాసం