Commonwealth Games 2022 : రెజ్లింగ్ లో మరో ఆరు పతకాలు - వినేష్ ఫొగాట్, రవికుమార్, నవీన్ కు గోల్డ్ మెడల్స్ -india wins 12 medals in wrestling at cwg 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /   India Wins 12 Medals In Wrestling At Cwg 2022

Commonwealth Games 2022 : రెజ్లింగ్ లో మరో ఆరు పతకాలు - వినేష్ ఫొగాట్, రవికుమార్, నవీన్ కు గోల్డ్ మెడల్స్

HT Telugu Desk HT Telugu
Aug 07, 2022 10:15 AM IST

కామెన్వెల్త్ గేమ్స్ లో భారత రెజ్లర్లు చరిత్రను సృష్టించారు. ఐదు గోల్డ్, ఒక సిల్వర్, ఐదు బ్రాంజ్ మెడల్స్ తో మొత్తం పన్నెండు పతకాలు సాధించారు.

నవీన్ కుమార్
నవీన్ కుమార్ (twitter/teamindia)

Commonwealth Games 2022: రెజ్లింగ్ లో శనివారం భారత క్రీడాకారులు సత్తా చాటారు. రవికుమార్, నవీన్, వినేష్ ఫొగాట్ గోల్డ్ మెడల్స్ తో మెరవగా పూజా గెహ్లాట్ , పూజ సిహాగ్, దీపక్ నెహ్రా బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

మెన్స్ ఫ్రీ స్టైల్ 57 కేజీల విభాగంలో రవికుమార్ దహియా చక్కటి ఆటతీరుతో ఫైనల్ చేరుకున్నాడు. ఫైనల్ లో నైజిరియీ రెజ్టర్ వెల్సన్ ను 10 0 తో ఓడించిగోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు.మెన్స్ ఫ్రీస్టైల్ 74 కేజీల విభాగంలో పాకిస్థాన్ ప్లేయర్ మహమ్మద్ తాహిర్ ను ఓడించిన నవీన్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు.

ఉమెన్స్ 53 కేజీల నోర్డిక్ సిస్టమ్ విభాగంలో వినేష్ ఫొగట్ గోల్డ్ మెడల్ సాధించింది. ఉమెన్స్ ఫ్రీ స్టైల్ 76 కేజీల విభాగంలో ఆస్ట్రేలియా ప్లేయర్ నయోమీ బ్రూనే ను ఓడించి పూజా షిహాగ్ బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నది. ఉమెన్స్ ఫ్రీ స్టైల్ 50 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో స్కాట్ లాండ్ ప్లేయర్ లెట్చిజోపై విజయాన్ని సాధించిన పూజా గెహ్లట్ భారత్ కు పతాకాన్ని అందించింది. మెన్స్ ఫ్రీ స్టైల్ 97 కేజీల విభాగంలో పాకిస్థాన్ రెజ్లర్ తయాబ్ రజా పై విజయాన్ని సాధించిన దీపక్ నెహ్రా కాంస్య పతకాన్ని అందుకున్నాడు.

మొత్తం రెజ్లింగ్ లో పన్నెండు విభాగాల్లో పోటీపడిన భారత్ అన్నింటిలో పతకాల్ని గెలుచుకున్నది. ఆరు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్, ఐదు బ్రాంజ్ మెడల్స్ దక్కించుకున్నది.

WhatsApp channel