తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shubman Gill Century: 55 బాల్స్‌లోనే 126 రన్స్‌ బాదిన శుభ్‌మన్‌ గిల్‌

Shubman Gill century: 55 బాల్స్‌లోనే 126 రన్స్‌ బాదిన శుభ్‌మన్‌ గిల్‌

Hari Prasad S HT Telugu

01 November 2022, 19:38 IST

    • Shubman Gill century: 55 బాల్స్‌లోనే 126 రన్స్‌ బాదాడు శుభ్‌మన్‌ గిల్‌. పంజాబ్‌ టీమ్‌ తరఫున సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో అతడు చెలరేగిపోయాడు.
సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్‌ గిల్‌
సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్‌ గిల్‌ (twitter)

సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్‌ గిల్‌

Shubman Gill century: టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ డొమెస్టిక్‌ క్రికెట్‌లో చెలరేగిపోయాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో కర్ణాటకతో జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో అతడు కేవలం 55 బాల్స్‌లోనే 126 రన్స్‌ చేశాడు. పంజాబ్‌ తరఫున బరిలోకి దిగిన శుభ్‌మన్‌.. రెచ్చిపోయి ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌తో కలిసి అతడు మూడో వికెట్‌కు 151 రన్స్‌ జోడించడంతో పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 225 రన్స్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన పంజాబ్‌ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో అన్మోల్‌తో కలిసి శుభ్‌మన్‌ కీలకమైన 151 రన్స్‌ పార్ట్‌నర్‌షిప్‌ నెలకొల్పాడు.

ఈ క్రమంలో 49 బాల్స్‌లోనే అతడు సెంచరీ బాదాడు. ఆ తర్వాత మరో ఆరు బంతుల్లో 26 రన్స్‌ చేయడం విశేషం. చివరికి 55 బాల్స్‌లో 126 రన్స్‌ చేసి 19వ ఓవర్లో ఔటయ్యాడు. దీంతో పంజాబ్‌ 225 రన్స్‌ చేసింది. ఆ తర్వాత కర్ణాటక కూడా బాగానే పోరాడింది. అయితే చివరికి 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన పంజాబ్‌ సెమీస్‌లో అడుగుపెట్టింది.

కర్ణాటక తరఫున అభినవ్ మనోహర్‌ కేవలం 29 బాల్స్‌లోనే 62 రన్స్‌ చేశాడు. మనీష్‌ పాండే 45, చేతన్‌ 33, క్రిష్ణప్ప గౌతమ్‌ 30 రన్స్‌ చేసినా.. టాపార్డర్‌ వైఫల్యంతో కర్ణాటకకు ఓటమి తప్పలేదు. ఆ టీమ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 రన్స్‌ మాత్రమే చేసింది. 226 రన్స్‌ చేజింగ్‌లో కర్ణాటక 18 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ కేవలం 8 రన్స్‌ చేసి ఔటయ్యాడు.

టాపిక్

తదుపరి వ్యాసం