Cricket | ఇండియాలో ఉన్న డొమెస్టిక్‌ క్రికెట్‌ టోర్నీల గురించి మీకు తెలుసా?-these are the domestic cricket tournaments in india ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cricket | ఇండియాలో ఉన్న డొమెస్టిక్‌ క్రికెట్‌ టోర్నీల గురించి మీకు తెలుసా?

Cricket | ఇండియాలో ఉన్న డొమెస్టిక్‌ క్రికెట్‌ టోర్నీల గురించి మీకు తెలుసా?

Hari Prasad S HT Telugu
Dec 20, 2021 05:44 PM IST

అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లకు మన దగ్గర కొదవ లేదు. ప్రపంచంలోనే ధనికవంతమైన క్రికెట్‌ బోర్డు అయిన మన బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌పైనా బాగానే ఖర్చు చేస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్‌ కారణంగా ఇండియాకు కొందరు ఆణిముత్యాల్లాంటి ప్లేయర్స్‌ దొరికినా.. మిగతా దేశవాళీ టోర్నీలు కూడా తక్కువేమీ కాదు.

ఇండియాలో అత్యున్నత దేశవాళీ క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీ
ఇండియాలో అత్యున్నత దేశవాళీ క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీ (AP)

Cricket.. ఓ నేషనల్‌ క్రికెట్‌ టీమ్‌ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ముందు దేశవాళీ క్రికెట్‌ మెరుగ్గా ఉండాలి. నేషనల్‌ టీమ్‌కు మెరికల్లాంటి ప్లేయర్స్‌ దొరికేది ఈ డొమెస్టిక్‌ క్రికెట్‌ నుంచే. ఓ దశాబ్దం కిందటితో పోలిస్తే ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెట్‌ చాలా పటిష్ఠంగా ఉంది. ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్స్‌ వస్తున్నారు. నేషనల్‌ టీమ్‌ను ఎంపిక చేయడం ఇప్పుడు సెలక్టర్లకు సవాలుగా మారిందంటే కారణం ఇదే. 

ఈ మధ్యే మనం చూశాం. ఇంగ్లండ్‌లో ఓ టీమ్‌ ఆడుతుంటే.. శ్రీలంకకు మరో టీమ్‌ వెళ్లింది. అంటే అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లకు మన దగ్గర కొదవ లేదు. ప్రపంచంలోనే ధనికవంతమైన క్రికెట్‌ బోర్డు అయిన మన బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌పైనా బాగానే ఖర్చు చేస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్‌ కారణంగా ఇండియాకు కొందరు ఆణిముత్యాల్లాంటి ప్లేయర్స్‌ దొరికినా.. మిగతా దేశవాళీ టోర్నీలు కూడా తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో అసలు మన దేశంలో ఉన్న డొమెస్టిక్‌ క్రికెట్‌ టోర్నమెంట్లు ఏవి? వాటి ఫార్మాట్‌ ఏంటి? ఎందులో ఎవరు ఛాంపియన్‌ వంటి సమగ్రమైన వివరాలు మీకోసం.

రంజీ ట్రోఫీ

ఇండియాలో అత్యున్నత దేశవాళీ క్రికెట్‌ టోర్నీ ఈ రంజీ ట్రోఫీ. 1934లో ప్రారంభమైంది. బీసీసీఐ వ్యవస్థాపకుడు ఏఎస్‌ డిమెలో ఈ టోర్నీని ప్రతిపాదించారు. మొదట్లో దీని పేరు క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియా. అయితే ఆ తర్వాత భారత్‌ నుంచి తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా పేరుగాంచిన రంజిత్‌సింగ్‌జీ పేరు మీద రంజీ ట్రోఫీగా మార్చారు. 

రౌండ్ రాబిన్‌, నాకౌట్‌ స్టేజ్‌లలో ఈ టోర్నీ జరుగుతుంది. మొత్తం 38 టీమ్స్‌ను ప్లేట్, ఎలైట్‌ అంటూ రెండు డివిజన్లుగా విభజిస్తారు. ఇప్పటి వరకూ అత్యధికంగా 41 టైటిల్స్‌తో బాంబే తొలిస్థానంలో ఉంది. ప్రస్తుత ఛాంపియన్‌ సౌరాష్ట్ర. రంజీ ట్రోఫీ ఒక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌. రౌండ్‌ రాబిన్‌ స్టేజ్‌లో ఒక మ్యాచ్‌ నాలుగు రోజులు, నాకౌట్‌ స్టేజ్‌లో ఐదు రోజులు ఉంటుంది.

దులీప్‌ ట్రోఫీ

ఇది కూడా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్పే. మాజీ క్రికెటర్‌ దులీప్‌సింగ్‌జీ పేరిట ఈ టోర్నీ స్టార్ట్ చేశారు. తొలిసారి 1961-62లో జరిగింది. మొదట్లో దేశంలోని టీమ్స్‌ను జోన్ల వారీగా చేసి ఈ టోర్నీ ఆడించే వాళ్లు. ఈస్ట్‌ జోన్‌, వెస్ట్‌ జోన్‌, సౌత్‌ జోన్‌, నార్త్ జోన్‌, సెంట్రల్‌ జోన్‌ అని ఐదు జోన్లు ఉండేవి. ప్రారంభంలో నాకౌట్‌ ఫార్మాట్‌ ఉన్నా.. 1993 నుంచి లీగ్‌ ఫార్మాట్‌లోకి మార్చారు. ప్రస్తుతం ఈ ట్రోఫీని జోన్ల వారీగా కాకుండా ఇండియా రెడ్‌, ఇండియా బ్లూ, ఇండియా గ్రీన్‌ పేరుతో మూడు టీమ్స్‌తోనే ఆడిస్తున్నారు. ప్రస్తుతం ఇండియా రెడ్‌ ఛాంపియన్‌గా ఉంది. వీటికి ముందు జోన్ల వారీగా టోర్నీ జరిగే సమయంలో నార్త్‌, వెస్ట్‌ జోన్లు చెరో 18 టైటిళ్లు సాధించాయి.

ఇరానీ కప్‌

రంజీ ట్రోఫీ సిల్వర్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో భాగంగా 1959-60ల్లో తొలిసారి ఇరానీకప్‌ను ప్రారంభించారు. ఈ టోర్నీలో కేవలం ఒకే మ్యాచ్‌ జరుగుతుంది. ఆ ఏడాది రంజీ ట్రోఫీ ఛాంపియన్‌తో రెస్టాఫ్‌ ఇండియా టీమ్‌ తలపడుతుంది. ఇండియన్‌ క్రికెట్‌ చరిత్రలో, బీసీసీఐలో కీలకపాత్ర పోషించిన జెడ్‌ఆర్‌ ఇరానీ గౌరవార్థం ఆయన పేరు మీద ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ అత్యధికసార్లు రెస్టాఫ్‌ ఇండియా టీమే ఇరానీ కప్‌ను సొంతం చేసుకుంది.

|#+|

దేవ్‌ధర్‌ ట్రోఫీ

ఇదొక లిస్ట్‌-ఎ ఫార్మాట్‌ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌. వన్డే ఫార్మాట్‌లో జరుగుతుంది. ప్రముఖ క్రికెటర్‌ డీబీ దేవ్‌ధర్‌ పేరు మీద ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. దులీప్‌ ట్రోఫీలాగే మొదట్లో దీనిని కూడా జోన్ల మధ్య నిర్వహించినా.. తర్వాత ఇండియా ఎ, ఇండియా బి, ఇండియా సి మధ్య నిర్వహిస్తున్నారు. జోన్లుగా నిర్వహించే సమయంలో నార్త్‌ జోన్‌ అత్యధిక టైటిల్స్‌ గెలిచింది.

విజయ్‌ హజారే ట్రోఫీ

ఇండియాలో నిర్వహించే అతిపెద్ద 50 ఓవర్ల దేశవాళీ టోర్నీమెంట్‌ ఇది. రంజీ ట్రోఫీలో పాల్గొనే మొత్తం 38 టీమ్స్‌ ఇందులో ఆడుతాయి. దేశంలోని అత్యున్నత క్రికెటర్ల ఒకడిగా పేరుగాంచిన విజయ్‌ హజారే గౌరవార్థం 2002-03 నుంచి ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో రౌండ్ రాబిన్‌ గ్రూప్‌ స్టేజ్‌ తర్వాత ప్లేఆఫ్స్‌ జరుగుతాయి. ఇప్పటి వరకూ ఐదు టైటిల్స్‌తో తమిళనాడు ముందుంది.

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ

టీ20 క్రికెట్‌కు క్రేజ్‌ పెరిగిన తర్వాత ప్రారంభమైన టోర్నీ ఇది. తొలి ఐపీఎల్‌ సీజన్‌ ముగియగానే బీసీసీఐ ఈ డొమెస్టిక్‌ టోర్నీకి తెరతీసింది. ఈ టీ20 టోర్నీలోనూ మొత్తం 38 దేశవాళీ టీమ్స్ పాల్గొంటాయి. ఇప్పటి వరకూ 13 సీజన్లు జరగగా.. ఏ టీమ్ కూడా రెండుకంటే ఎక్కువసార్లు టోర్నీ గెలవకపోయింది.

WhatsApp channel

సంబంధిత కథనం