తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shreyas Iyer Ruled Out: శ్రేయస్‌ అయ్యర్‌కు గాయం.. న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ నుంచి ఔట్‌

Shreyas Iyer ruled out: శ్రేయస్‌ అయ్యర్‌కు గాయం.. న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ నుంచి ఔట్‌

Hari Prasad S HT Telugu

17 January 2023, 15:14 IST

    • Shreyas Iyer ruled out: శ్రేయస్‌ అయ్యర్‌కు గాయమైంది. దీంతో అతడు న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని మంగళవారం (జనవరి 17) వెల్లడించిన బీసీసీఐ.. కొత్త టీమ్‌ను అనౌన్స్‌ చేసింది.
శ్రేయస్ అయ్యర్
శ్రేయస్ అయ్యర్ (ANI)

శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer ruled out: టీమిండియా గాయాల జాబితాలో మరో ప్లేయర్‌ చేరాడు. తాజాగా స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్ కూడా గాయం బారిన పడ్డాడు. గతేడాది ఇండియన్‌ టీమ్‌ తరఫున అత్యధిక రన్స్‌ చేసిన బ్యాటర్‌గా నిలిచిన శ్రేయస్‌.. వెన్నుగాయానికి గురైనట్లు బీసీసీఐ మంగళవారం (జనవరి 17) వెల్లడించింది. దీంతో అతడు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

శ్రేయస్‌ స్థానంలో రజత్‌ పటీదార్‌ను టీమ్‌లోకి ఎంపిక చేశారు. శ్రేయస్‌ గాయం నుంచి కోలుకోవడానికి బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడెమీకి వెళ్లనున్నాడు. "వెన్నుగాయం కారణంగా టీమిండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ రానున్న న్యూజిలాండ్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడతడు నేషనల్ క్రికెట్‌ అకాడెమీకి వెళ్లనున్నాడు. ఆలిండియా సెలక్షన్‌ కమిటీ శ్రేయస్‌ స్థానంలో రజత్‌ పటీదార్‌ను ఎంపిక చేసింది" అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

ఈ మధ్యే శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో శ్రేయస్‌ ఆడాడు. అయితే అతడు పెద్దగా రాణించలేదు. కేవలం 28, 28, 38 స్కోర్లు మాత్రమే చేశాడు. వన్డేల్లో సూర్యకుమార్‌ను కాదని శ్రేయస్‌కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు శ్రేయస్‌ స్థానంలో వచ్చిన రజత్‌ పటీదార్‌ గతంలోనూ టీమ్‌లోకి ఎంపికైనా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు.

అయితే ఇప్పుడు కూడా తుది జట్టులో రజత్‌కు అవకాశం దక్కేది అనుమానమే. అయ్యర్‌ స్థానంలో సూర్యకుమార్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. టీ20ల్లో సత్తా చాటుతున్నా.. వన్డేల్లో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు సూర్యకుమార్‌. శ్రీలంకతో చివరి వన్డేలో ఆడే అవకాశం దక్కినా కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ బుధవారం (జనవరి 18) నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తొలి వన్డే హైదరాబాద్‌లో జరుగుతుంది.

న్యూజిలాండ్‌తో ఆడే వన్డే టీమ్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్ కిషన్‌, విరాట్ కోహ్లి, సూర్యకుమార్‌, కేఎస్‌ భరత్‌, హార్దిక్‌ పాండ్యా, రజత్‌ పటీదార్‌, వాషింగ్టన్ సుందర్‌, షాబాజ్‌ అహ్మద్, శార్దూల్‌ ఠాకూర్‌, యుజువేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌

తదుపరి వ్యాసం