NCA to work with IPL franchises: ఐపీఎల్‌లో వరల్డ్‌కప్ ప్లేయర్స్ ఆడతారా లేదా? బీసీసీఐ ఎందుకా నిర్ణయం తీసుకుంది?
NCA to work with IPL franchises: ఐపీఎల్‌లో వరల్డ్‌కప్ ప్లేయర్స్ ఆడతారా లేదా? ఒకవేళ ఆడినా వాళ్లపై పనిభారం తగ్గించాలని ఫ్రాంఛైజీలను కోరతారా? బీసీసీఐ ఆదివారం జరిపిన సమీక్షా సమావేశంలో తీసుకున్న ఓ నిర్ణయం ఈ ప్రశ్నలను లేవనెత్తుతోంది.
NCA to work with IPL franchises: బీసీసీఐ ఆదివారం (జనవరి 1) జరిపిన రివ్యూ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్లేయర్స్‌కు యో యో టెస్ట్‌తోపాటు డెక్సా స్కాన్ టెస్ట్ కూడా తప్పనిసరి చేయాలని భావిస్తోంది. దీంతోపాటు కొంతమంది ఎంపిక చేసిన ఇండియన్ ప్లేయర్స్ ఐపీఎల్‌లో ఆడే విషయంపైనా ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ మేరకు నేషనల్ క్రికెట్ అకాడెమీ(ఎన్సీఏ).. ఆ ప్లేయర్స్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలతో కలిసి పని చేస్తుందని బీసీసీఐ వెల్లడించింది. ఈ ఏడాది చివర్లో జరగబోయే వన్డే వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ 20 మంది ప్లేయర్స్‌ను షార్ట్‌లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ప్లేయర్స్‌ను ఉద్దేశించే పరోక్షంగా బీసీసీఐ ఈ నిబంధన విధించి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ మధ్య వరుస గాయాలతో కీలకమైన ప్లేయర్స్ తరచూ ఇండియన్ టీమ్‌కు దూరమవుతున్న నేపథ్యంలో ఆ దిశగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. "ప్లేయర్స్ తరచూ ఇలా ఎందుకు గాయపడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సమస్య మూలాల గురించి అధ్యయనం చేసి దానిని ఎలా మార్చవచ్చన్నదానిపై నిర్ణయం తీసుకుంటాం" అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు.
ఇండియన్ ప్లేయర్స్‌పై బీసీసీఐ ఆంక్షలు?
ఐపీఎల్‌లో ఆ ఎంపిక చేసిన ఇండియన్ ప్లేయర్స్ ఆడటంపై బీసీసీఐ నియంత్రణ విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక బౌలర్లకైతే నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా పొందాల్సి ఉంటుంది. దీనికోసం చేయాల్సిన, చేయకూడని పనులు కూడా ఉంటాయి. బౌలర్లు ఐపీఎల్‌లో ఎక్కువ భాగం విశ్రాంతి పొందితే.. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం కాకుండా ఉంటారని బోర్డు భావిస్తోంది.
ఈ విషయంపై ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ఇంకా అధికారిక సమాచారం అందలేదు. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే.. తాము ప్లేయర్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కొన్ని ఫ్రాంఛైజీలు వెల్లడించాయి. వరల్డ్‌కప్‌లో ఆడే ప్లేయర్స్‌పై పనిభారం తగ్గేలా చూస్తున్నామని, 2019 వరల్డ్‌కప్ సమయంలోనూ ఇలాగే వ్యవహరించినట్లు ఓ ఫ్రాంఛైజీ అధికారి చెప్పారు.
ఐపీఎల్ ద్వారా ఇండియన్ టీమ్‌కు మంచి నైపుణ్యం ఉన్న ప్లేయర్స్ లభిస్తున్నా.. అదే సమయంలో ఈ లీగ్ వల్ల గాయపడుతున్న సీనియర్ ప్లేయర్స్ సంఖ్య కూడా పెరిగిపోతోంది. దీంతో ఐపీఎల్ కాకుండా ఇండియన్ టీమ్‌పై దృష్టి సారించాలని పలువురు మాజీలు ప్లేయర్స్‌కు సూచిస్తున్నారు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌కు పేస్ బౌలర్ బుమ్రా దూరం కావడం ఇండియా అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసిన విషయం తెలిసిందే.
దీంతో బౌలర్లపై పనిభారం విషయంలో బీసీసీఐ మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఐపీఎల్‌లో టాప్ ఇండియన్ ప్లేయర్స్‌ను కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతినిచ్చేలా బోర్డు అధ్యక్షుడు బిన్నీ చూడాలని గతంలో మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా సూచించాడు. గత ఏడాది కాలంలో ఇండియన్ టీమ్‌కు ఆడిన 23 మంది ప్లేయర్స్ వివిధ గాయాలతో నేషనల్ క్రికెట్ అకాడెమీకి వెళ్లడం ఆందోళన కలిగించేదే.
సంబంధిత కథనం