తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Satwiksairaj Rankireddy: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్‌సాయిరాజ్

Satwiksairaj Rankireddy: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్‌సాయిరాజ్

Hari Prasad S HT Telugu

18 July 2023, 16:53 IST

    • Satwiksairaj Rankireddy: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాడు బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి. ప్రపంచంలో అత్యంత వేగంగా స్మాష్ హిట్ కొట్టిన రికార్డును అతడు సొంతం చేసుకున్నాడు.
బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి
బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి

బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి

Satwiksairaj Rankireddy: ఇండియన్ స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ఓ అరుదైన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. బ్యాడ్మింటన్ లో ఫాస్టెస్ట్ హిట్ కొట్టిన మేల్ ప్లేయర్ గా నిలిచాడు. అతడు ఏకంగా గంటకు 565 కి.మీ. వేగంతో స్మాష్ హిట్ కొట్టడం విశేషం. ఈ హిట్ తో పదేళ్ల రికార్డును సాత్విక్ తుడిచిపెట్టేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ మధ్యే తన డబుల్స్ పార్ట్‌నర్ చిరాగ్ శెట్టితో కలిసి ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీ గెలిచాడు సాత్విక్. ఈ టోర్నీలో ఆడటానికి ముందే వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు. ఇంతకుముందు 2013లో మలేషియాకు చెందిన టాన్ బూన్ హియాంగ్ గంటలకు 493 కి.మీ. వేగంతో స్మాష్ కొట్టాడు. ఇప్పుడా వేగం కంటే కూడా ఏకంగా 72 కి.మీ. ఎక్కువ వేగంతో సాత్విక్ స్మాష్ కొట్టడం విశేషం.

ఓ ఫార్ములా వన్ కారు వెళ్లే అత్యధిక వేగం కంటే కూడా సాత్విక్ కొట్టిన షాట్ వేగం ఎక్కువ. ఫార్ములా వన్ కారు గంటకు గరిష్ఠంగా 372.6 కి.మీ. వేగంతో వెళ్లగలదు. దీనిని బట్టి సాత్విక్ కొట్టిన ఆ షాట్ ఏ వేగంతో వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇక మహిళల బ్యాడ్మింటన్ లో ఈ రికార్డును మలేషియాకు చెందిన టాన్ పియర్లీ బ్రేక్ చేసింది. ఆమె గంటకు 438 కి.మీ. వేగంతో ఓ షాట్ కొట్టింది.

ఈ ఇద్దరూ వరల్డ్ రికార్డులు బ్రేక్ చేసినట్లు జపాన్ కు చెందిన స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ తయారీ సంస్థ యోనెక్స్ వెల్లడించింది. సాత్విక్ ఈ రికార్డును ఈ ఏడాది ఏప్రిల్ 14న సాధించాడు. జపాన్ లోని సైతామాలోని సోకాలో ఉన్న యోనెక్స్ ఫ్యాక్టరీ జిమ్నాజియంలో సాత్విక్ ఈ రికార్డు స్మాష్ హిట్ కొట్టాడు.

టాపిక్

తదుపరి వ్యాసం