తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sam Curran On Ipl Auction 2023: ఐపీఎల్‌ వేలంలో నాకు భారీ ధర దక్కుతుందని అనుకుంటున్నా: సామ్‌ కరన్‌

Sam Curran on IPL Auction 2023: ఐపీఎల్‌ వేలంలో నాకు భారీ ధర దక్కుతుందని అనుకుంటున్నా: సామ్‌ కరన్‌

Hari Prasad S HT Telugu

22 December 2022, 13:03 IST

    • Sam Curran on IPL Auction 2023: ఐపీఎల్‌ వేలంలో తనకు భారీ ధర దక్కుతుందని అనుకుంటున్నట్లు ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ సామ్‌ కరన్‌ అన్నాడు. తాను వేలాన్ని టీవీలో చూడనున్నట్లు చెప్పాడు.
ఇంగ్లండ్ బౌలర్ సామ్ కరన్
ఇంగ్లండ్ బౌలర్ సామ్ కరన్ (AFP)

ఇంగ్లండ్ బౌలర్ సామ్ కరన్

Sam Curran on IPL Auction 2023: ఐపీఎల్‌ వేలం 2023కు టైమ్‌ దగ్గర పడుతోంది. శుక్రవారం (డిసెంబర్‌ 23) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి కొచ్చిలో ఈ వేలం జరగనుంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా టాప్‌ క్రికెటర్లంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బెన్‌ స్టోక్స్‌, సామ్‌ కరన్‌లాంటి ఇంగ్లండ్‌ ప్లేయర్స్‌కు వేలంలో భారీ ధర లభించనున్నట్లు అంచనా వేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

ఈ నేపథ్యంలో సామ్ కరన్‌ స్పందించాడు. అతడు రూ.2 కోట్ల బేస్‌ ప్రైస్‌తో ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్నాడు. కరన్‌ ఉన్న బ్రాకెట్‌లోనే బెన్‌ స్టోక్స్‌లాంటి వాళ్లు ఉండటంతో ఆ ప్రభావం అతని ధరపై పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వేలంపై కరన్‌ మాట్లాడాడు. తనకు మంచి ధర దక్కుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు.

"నేను గత ఐపీఎల్‌ వేలాల్లోనూ పాల్గొన్నాను. బేస్‌ప్రైస్‌తో ఈ వేలంలో పాల్గొంటాం. ఈ వేలాన్ని టీవీలో చూస్తాను. శుక్రవారం ఉదయం వేలం ప్రారంభమైన తర్వాత నా పేరు రాగానే ఫ్రాంఛైజీలు తమ పెడల్‌ను ఎక్కువగా ఉపయోగించాలని కోరుకుంటున్నాను" అని ది టెలిగ్రాఫ్‌తో కరన్‌ అన్నాడు. 2019 వేలంలో తొలిసారి పంజాబ్ కింగ్స్‌ అతన్ని రూ.7.2 కోట్లకు కొనుగోలు చేసింది.

ఆ తర్వాత 2020 వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్ కరన్‌ను రూ.5.5 కోట్లకు సొంతం చేసుకున్నా.. 2022 సీజన్‌లో టీమ్‌ 9వ స్థానంతో సరిపెట్టుకోవడంతో ప్రక్షాళనలో భాగంగా కరన్‌ను రిలీజ్‌ చేసింది. అయితే ఈసారి వేలంలో తనకు మంచి ధర దక్కుతుందన్న విశ్వాసంతో కరన్‌ ఉన్నాడు.

"మొదటిది ఎవరైనా మనల్ని తీసుకోవాలి. నా విషయంలో ఆ సందేహం లేదు. అయితే భారీ ధర వస్తుందన్న విశ్వాసంతో ఉన్నాను. కానీ బెన్‌ స్టోక్స్‌తో పాటు కొంత మంది ఇతర ఆల్‌రౌండర్లు ఉన్న బ్రాకెట్‌లోనే నేనూ ఉన్నాను. ప్లేయర్స్‌ను సెట్స్‌ ప్రకారం వేలం వేస్తారని తెలుసు. ఏదైనా జరగొచ్చు" అని సామ్‌ కరన్‌ అన్నాడు.

టాపిక్

తదుపరి వ్యాసం