తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit And Virat Records: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో అరుదైన రికార్డులపై కన్నేసిన రోహిత్, కోహ్లి

Rohit and Virat Records: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో అరుదైన రికార్డులపై కన్నేసిన రోహిత్, కోహ్లి

Hari Prasad S HT Telugu

28 February 2023, 22:11 IST

    • Rohit and Virat Records: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో అరుదైన రికార్డులపై కన్నేశారు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి. ఈ టెస్టులోనే వీళ్లు ఆ రికార్డులు అందుకునే అవకాశాలు ఉన్నాయి.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (ANI)

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి

Rohit and Virat Records: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇండోర్ లోనే పట్టేయాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది. బుధవారం (మార్చి 1) నుంచి ప్రారంభమవుతున్న ఈ టెస్టులో గెలిస్తే సిరీస్ ఇండియా సొంతమవుతుంది. ఇప్పటికే తొలి రెండు టెస్టులను హోమ్ టీమ్ గెలిచిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఇక ఇదే మూడో టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కొన్ని రికార్డులపై కన్నేశారు. ఇప్పటికే రెండో టెస్టులో కోహ్లి ఇంటర్నేషనల్ క్రికెట్ లో 25 వేల పరుగుల రికార్డు అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్ గా అతడు నిలిచాడు. ఇక ఇప్పుడు ఇండోర్ టెస్టులో విరాట్ మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు.

విరాట్ స్వదేశంలో టెస్టుల్లో 4 వేల పరుగులు పూర్తి చేయడానికి కేవలం 77 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇక రోహిత్ తో కలిసి విరాట్ టెస్టుల్లో 1000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేయడానికి 44 పరుగుల దూరంలో ఉండటం విశేషం. ఈ రెండు రికార్డులు మూడో టెస్టులో కోహ్లికి అందే అవకాశాలు ఉన్నాయి.

అటు కెప్టెన్ రోహిత్ కూడా ఓ రికార్డుకు చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 183 పరుగులతో రోహిత్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఇక అతడు అంతర్జాతీయ క్రికెట్ లో 17 వేల పరుగులు పూర్తి చేయడానికి 45 పరుగుల దూరంలో ఉన్నాడు. రోహిత్ ఈ మార్క్ అందుకుంటే సచిన్, విరాట్, ద్రవిడ్, గంగూలీ, ధోనీ, సెహ్వాగ్ తర్వాత 17 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన ఇండియన్ క్రికెటర్ గా నిలుస్తాడు.

ఇక స్వదేశంలో 2 వేల టెస్టులు పరుగులు పూర్తి చేయడానికి రోహిత్ 57 పరుగుల దూరంలో ఉన్నాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ గా 3 వేల పరుగులు పూర్తి చేయడానికి కూడా రోహిత్ 80 పరుగుల దూరంలో ఉండటం విశేషం. మరి ఈ ఇద్దరు టీమిండియా మొనగాళ్లు మూడో టెస్టులో ఈ రికార్డులను అందుకుంటారో లేదో చూడాలి.

తదుపరి వ్యాసం