తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Suryakumar Yadav: సూర్యకుమార్‌ను డివిలియర్స్‌తో పోల్చిన పాంటింగ్

Suryakumar Yadav: సూర్యకుమార్‌ను డివిలియర్స్‌తో పోల్చిన పాంటింగ్

16 August 2022, 11:21 IST

    • టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడిని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌తో పోల్చాడు.
సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (AFP)

సూర్యకుమార్ యాదవ్

టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం నిలకడగా రాణిస్తూ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. మైదానంలో 360 డిగ్రీల కోమంలో ఆడుతూ టీమ్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌కు దొరికిన పదునైన అస్త్రం మాదిరిగా తన సత్తా చాటుతున్నాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా చేరిపోయాడు. సూర్యకుమార్ యాదవ్‌ను ఏకంగా ఏబీ డివిలియర్స్‌తో పోల్చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

"మైదానంలో సూర్య 360 డిగ్రీల కోణంలో ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. అతడి ఆటతీరును చూస్తే ఏబీ డివిలియర్స్ మాదిరిగా అనిపిస్తోంది. అతడి ల్యాప్ షాట్లు, లేట్ కట్స్ ఇలాంటివి చూస్తే డివిలియర్స్ శైలినే పోలి ఉంటాయి. కీపర్ తలపై గుండా అతడు కొట్టే షాట్ అద్భుతంగా ఉంటుంది. లెగ్ సైడ్ చాలా బాగా హిట్టింగ్ చేస్తాడు. ముఖ్యంగా డీప్ బ్యాక్వార్డ్ స్క్వేర్ లెగ్‌లో అతడి బ్యాటింగ్ బాగుంటుంది. అతడు పేస్, స్పిన్ రెండింట్లోనూ పర్ఫెక్ట్ ఆటగాడు" అని పాంటింగ్ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

సూర్య ఏ జట్టులో ఉన్నా అతడి ఆట కోసం అభిమానులు ఆత్రుతగా చూస్తారని తాను భావిస్తున్నట్లు రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు. సూర్య చాలా అత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆటలో ఎదురయ్యే సవాలను ఎదుర్కొంటాడు. ఎప్పటికీ వైదొలగడు. జట్టు గెలుపు కోసం ఎలాంటి పరిస్థితినైనా గెలవగలడని నేను అనుకుంటున్నాను. ఏ స్థానంలోనైనా చివరకు ఓపెనర్‌గా కూడా ఆడగలడు. రానున్న టీ20 ప్రపంచకప్‌లో సూర్య నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నాను అని పాంటింగ్ స్పష్టం చేశాడు.

సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు 23 టీ20ల్లో 37.33 సగటుతో 672 పరుగులు చేశాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అతడు రెండో స్థానంలో ఉన్నాడు. బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడు అద్భుతమైన ఆటతీరును కనబరుస్తాడు. 258.82 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

తదుపరి వ్యాసం