ICC T20I Rankings: టాప్‌ స్పాట్‌ మిస్‌.. రెండో ర్యాంక్‌లోనే సూర్యకుమార్‌ యాదవ్‌-suryakumar yadav remains in second spot in latest icc t20i rankings ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Icc T20i Rankings: టాప్‌ స్పాట్‌ మిస్‌.. రెండో ర్యాంక్‌లోనే సూర్యకుమార్‌ యాదవ్‌

ICC T20I Rankings: టాప్‌ స్పాట్‌ మిస్‌.. రెండో ర్యాంక్‌లోనే సూర్యకుమార్‌ యాదవ్‌

Hari Prasad S HT Telugu
Aug 10, 2022 05:39 PM IST

ICC T20I Rankings: ఇండియన్‌ టీమ్‌ స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఈసారి టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌ స్పాట్‌లోకి వస్తాడనుకున్నా.. అది సాధ్యం కాలేదు. పాక్‌ కెప్టెన్ బాబర్‌ ఆజం తన లీడ్‌ను మరింత పెంచుకున్నాడు.

సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (AP)

దుబాయ్‌: ఈ ఏడాది టీ20ల్లో టాప్‌ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ గత వారం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండోస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆ సమయానికి వెస్టిండీస్‌తో మరో రెండు టీ20లు మిగిలి ఉండటంతో ఈసారి బాబర్‌ ఆజంను వెనక్కి నెట్టి టాప్‌ ర్యాంక్‌ సాధిస్తాడని భావించారు. అయితే తాజా ర్యాంకింగ్స్‌లోనూ సూర్య రెండో స్థానంలో ఉన్నాడు.

బాబర్‌ ఆజం తన రేటింగ్‌ పాయింట్స్‌ను 818కి పెంచుకొని టాప్‌లో కొనసాగుతున్నాడు. ఈ మధ్యే వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో సూర్య బాగానే రాణించినా.. అతడు 11 పాయింట్లు కోల్పోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20లో అతనికి రెస్ట్‌ ఇవ్వడంతో బాబర్‌ ఆజంను వెనక్కి నెట్టే అవకాశాన్ని సూర్య కోల్పోయినట్లు ఐసీసీ చెబుతోంది.

నిజానికి బాబర్‌ తన చివరి టీ20ని గత ఏప్రిల్‌లో ఆడినా.. అతని నిలకడైన ఆటతీరుతో టాప్‌లో కొనసాగుతూ వస్తున్నాడు. అయితే రానున్న ఆసియా కప్‌లో బాబర్‌, సూర్య ఇద్దరూ ఆడుతుండటంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆసియాకప్‌లో భాగంగా ఆగస్ట్‌ 28న ఇండియా, పాకిస్థాన్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆడనున్నాయి.

ఇక ఈ ర్యాంకింగ్స్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ఆరు స్థానాలు మెరుగుపరచుకొని 19వ స్థానానికి చేరాడు. విండీస్‌తో చివరి మ్యాచ్‌లో అతడు హాఫ్‌ సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే. ఇక రిషబ్‌ పంత్‌ నాలుగో మ్యాచ్‌లో 44 రన్స్‌ చేయడంతో అతడు ఏడుస్థానాలు మెరుగుపరచుకొని 59వ స్థానానికి చేరాడు. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ ఒక స్థానం దిగజారి 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

WhatsApp channel