తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pm Modi Reaction On Pant: పంత్ ప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

PM Modi Reaction on Pant: పంత్ ప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

30 December 2022, 19:24 IST

    • PM Modi Reaction on Pant: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదవడంతో ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. యువ ఆటగాడు వెంటనే కోలుకోవాలని తాను భగవతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నరేంద్ర మోదీ-రిషబ్ పంత్
నరేంద్ర మోదీ-రిషబ్ పంత్

నరేంద్ర మోదీ-రిషబ్ పంత్

PM Modi Reaction on Pant: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో అతడు త్వరగా కోలుకోవాలని సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. పంత్ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. క్రికెటర్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

“ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రమాదానికి గురయ్యాడని తెలిసి బాధపడ్డాను. అతడు త్వరగా కోలుకోవాలని, నిండు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టారు.

పంత్ యాక్సిడెంట్‌పై క్రీడా సమాజం విచారం వ్యక్తం చేసింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్, క్రికెటర్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, శిఖర్ ధావన్, కెవిన్ పీటర్సన్, వీరేంద్ర సెహ్వాగ్. వీవీఎస్ లక్ష్మణ్, కేఎల్ రాహుల్, వసీం అక్రమ్, రవీంద్ర జడేజా, గౌతమ్ గంభీర్, మునాఫ్ పటేల్ సహా పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

శుక్రవారం ఉదయం దిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వెంటనే అతడిని డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పంత్ తల, మోకాలికి గాయమైంది. వీపు భాగం కాలిపోయింది. అయితే అతడు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. ప్రమాద సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

టాపిక్

తదుపరి వ్యాసం