తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Poonakalu Loading Song: పూనకాలు లోడింగ్ సాంగ్ వచ్చేసింది.. మెగా-మాస్ దెబ్బకు నిజంగా పూనకాలే

Poonakalu Loading Song: పూనకాలు లోడింగ్ సాంగ్ వచ్చేసింది.. మెగా-మాస్ దెబ్బకు నిజంగా పూనకాలే

30 December 2022, 18:49 IST

    • Poonakalu Loading Song: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం నుంచి పూనకాలు లోడింగ్ సాంగ్ వచ్చేసింది. ఇందులో చిరు, రవితేజ స్టెప్పులు మాస్ ఆడియోన్స్‌కు కిక్ ఎక్కించేలా ఉంది. ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది.
వాల్తేరు వీరయ్య సాంగ్ విడుదల
వాల్తేరు వీరయ్య సాంగ్ విడుదల

వాల్తేరు వీరయ్య సాంగ్ విడుదల

Poonakalu Loading Song: మెగా మాస్ కాంబోలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవీ, మాస్ మాహారాజా రవితేజ కలిసి స్టెప్పేసిన పునకాలు లోడింగ్ సాంగ్ విడుదలైంది. వీరిద్దరూ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం నుంచి పునకాలు లోడింగ్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. చిరు, రవితేజ ఇద్దరూ కలిసి స్టెప్పులతో అదరగొట్టారు. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన వాల్తేరు వీరయ్యలో ఈ పాట కోసం అభిమానులు ఆత్రుతగా చూస్తుండగా.. శుక్రవారం విడుదల చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

Krishna mukunda murari serial:ముకుందకు మురారి సేవలు.. మీరా నెల తప్పిందన్న భవానీ, షాక్ లో కృష్ణ

Karthika deepam 2:కార్తీకదీపం 2 సీరియల్..కాంచనని మోసం చేస్తున్న శ్రీధర్.. కార్తీక్ గురించి మరో నిజం తెలుసుకున్న పారిజాతం

ఈ పాటను రామ్ మిరియాల, రోల్ రైడా ఆలపించారు. వీరితో పాటు చిరంజీవి, రవితేజ కూడా గాత్రం అందించడంతో పాట వేరే లెవల్‌లో పోయింది. పూనకాలు లోడింగ్ అంటూ సాగే ర్యాప్ సాంగ్ ఫ్యాన్స్‌కు నిజంగానే పూనకాలు తెప్పించేలా ఉంది. భారీ జనం మధ్య మాస్ బీట్‌కు చిరంజీవి స్టైలిష్ స్టెప్పులతో పాట ఊపు తెప్పిస్తోంది. డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్ అంటూ మెగాస్టార్ గాత్రంలో వింటుంటే అభిమానులు పండగ చేసుకుంటున్నారు.ఈ పాట లిరిక్స్‌ను రోల్ రైడా రాశాడు.

పాట ఫస్టాఫ్‌లో చిరంజీవి తన గాత్రంతో అల్లాడించగా.. సెకాండాఫ్‌లో రవితేజ అందుకుంటారు. ఇద్దరూ కలిసి వేసే స్టెప్పులు ప్రేక్షకులను అలరిస్తాయి. శేఖర్ మాస్టార్ రూపొందించిన నృత్యాలకు వీరిద్దరూ అదరగొట్టారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. 2023 ఫెస్టివ్ సీజన్‌ను ఈ పాటతో డీఎస్‌పీ మరింత ఉల్లాసవంతంగా మార్చనున్నాడు.

ఈ వీడియోలో చిరంజీవి మాస్ గెటప్పులో కనిపించగా.. రవితేజ స్టైలిష్‌ అవతారంలో దర్శనమిచ్చారు. పూనకాలు లోడింగ్‌తో థియేటర్లలో అభిమానులు ఈలలు, గోలలతో హోరెత్తించడం పక్కా అనేంతగా ఆకట్టుకుంటోంది.

బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మన మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేసింది. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం