తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Neeraj Chopra: నీరజ్ చోప్రా సీజన్ బెస్ట్ త్రో.. పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన స్టార్ అథ్లెట్

Neeraj Chopra: నీరజ్ చోప్రా సీజన్ బెస్ట్ త్రో.. పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన స్టార్ అథ్లెట్

Hari Prasad S HT Telugu

25 August 2023, 15:11 IST

    • Neeraj Chopra: నీరజ్ చోప్రా సీజన్ బెస్ట్ త్రో వేశాడు. దీంతో అతడు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అంతేకాదు ఫైనల్ కు క్వాలిఫై అయి గోల్డ్ మెడల్ దిశగా మరో అడుగు వేశాడు.
నీరజ్ చోప్రా
నీరజ్ చోప్రా (AFP)

నీరజ్ చోప్రా

Neeraj Chopra: ఇండియన్ స్టార్ జావెలియన్ త్రోయర్, టోక్యో ఒలింపిక్స గోల్డ్ మెడలిస్ట్ వరల్డ్ అథ్లెటిక్స్ లోనూ సత్తా చాటుతున్నాడు. వరల్డ్ అథ్లెటిక్స్ లో తన సీజన్ బెస్ట్ త్రోతో అతడు 2024 పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. హంగరీలోని బుడాపెస్ట్ లో జరుగుతున్న ఈ వరల్డ్ అథ్లెటిక్స్ క్వాలిఫికేషన్ రౌండ్ లో నీరజ్ చెలరేగిపోయాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

జావెలిన్ ను అతడు 88.77 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్లో నీరజ్ చోప్రాకు ఇదే బెస్ట్ త్రో కావడం విశేషం. తొలి అటెంప్ట్ లోనే అతడు ఈ దూరాన్ని అందుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాలంటే 85.5 మీటర్ల దూరం విసరాల్సి ఉండగా.. నీరజ్ సులువుగా దానిని అధిగమించాడు. దీంతోపాటు వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్లో నీరజ్ చోటు సంపాదించాడు.

వరల్డ్ అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి ఇండియన్ గా నిలవడానికి నీరజ్ మరోసారి ప్రయత్నిస్తున్నాడు. నిజానికి 2022లో దానికి చేరువగా వచ్చినా.. చివరికి సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకున్నాడు. గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ అప్పుడు గోల్డ్ గెలిచాడు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లో ఇండియా సిల్వర్ మెడల్ గెలవడం కూడా అదే తొలిసారి.

అంతకుముందు 2003లో అంజూ బాబీ జార్జ్ లాంగ్ జంప్ లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఇప్పుడు నీరజ్ చోప్రా మరోసారి గోల్డ్ పై కన్నేశాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో 88.77 మీటర్ల దూరం అందుకొని రెండోస్థానంలో ఉన్నాడు. టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ జాకుబ్ వాద్లెచ్ 89.51 మీటర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఫైనల్లో నీరజ్ కు అతనితోనే ప్రధాన పోటీ.

అయితే ఈ ఏడాది ఎవరూ 90 మీటర్ల మార్క్ అందుకోలేదు. ఫైనల్లో నీరజ్ ఆ మార్క్ అందుకుంటే గోల్డ్ మెడల్ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ తోపాటు ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, డైమండ్ లీగ్ ఛాంపియన్ గా ఉన్న నీరజ్.. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లోనూ గోల్డ్ సాధిస్తే ఇక అతనికి తిరుగే ఉండదు. ఆదివారం (ఆగస్ట్ 27) ఈ ఫైనల్ జరగనుంది. ఇందులో 12 మంది పాల్గొననున్నారు.

తదుపరి వ్యాసం