Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డు
Neeraj Chopra: చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. జావెలిన్ త్రో మెన్స్ కేటగిరీలో వరల్డ్ నంబర్ వన్ గా నిలిచాడు.
Neeraj Chopra: ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు. మెన్స్ జావెలిన్ త్రోలో వరల్డ్ నంబర్ వన్ గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ గా అతడు నిలవడం విశేషం. సోమవారం (మే 22) రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ లో నీరజ్.. నంబర్ వన్ అయ్యాడు. ఈ క్రమంలో ఇన్నాళ్లూ నంబర్ వన్ గా ఉన్న ఆండర్సన్ పీటర్స్ ను వెనక్కి నెట్టాడు.
ఒలింపిక్స్ లో చరిత్రలో ట్రాక్ అండ్ ఫీల్డ్ లో గోల్డ్ గెలిచిన తొలి ఇండియన్ అథ్లెట్ గా నిలిచిన అతడు.. తాజాగా ఈ ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ మెగా ఈవెంట్ లో జావెలిన్ ను 87.58 మీటర్ల దూరం విసిరి నీరజ్ గోల్డ్ మెడల్ గెలిచాడు.
ఆ ఒలింపిక్స్ ఫామ్ ను రెండేళ్లుగా అతడు కొనసాగిస్తూనే ఉన్నాడు. జ్యూరిక్ లో జరిగిన డైమండ్ లీగ్ లోనూ 89.63 మీటర్ల దూరం ఈటెను విసిరి గోల్డ్ సొంతం చేసుకున్నాడు. ఇక తాజాగా దోహా డైమండ్ లీగ్ ఈవెంట్ లో 88.67 మీటర్ల దూరం విసిరి.. మరో గోల్డ్ గెలుచుకున్నాడు. ఈ విజయంతో అతడు ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లాడు.
2024 పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా తాను నిలకడగా రాణిస్తున్నట్లు దోహా ఈవెంట్ తర్వాత నీరజ్ చెప్పాడు. టోక్యో ఒలింపిక్స్ తో హీరోగా ఎదిగిన అతడు.. ఆ విజయం గాలివాటం కాదని నిరూపిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత కూడా ఇప్పటి వరకూ ఏ ఇతర భారతీయుడికీ సాధ్యం కాని విజయాలతో ర్యాంకుల్లోనూ నంబర్ వన్ అయ్యాడు.
టాపిక్