Telugu News  /  Entertainment  /  Neeraj Chopra Pushpa Style Along With Allu Arjun In Indian Of The Year 2022 Event
Neeraj Chopra with Ranveer Singh at an awards show; he also posed with Allu Arjun.
Neeraj Chopra with Ranveer Singh at an awards show; he also posed with Allu Arjun.

Neeraj Chopra Pushpa Style: అల్లు అర్జున్‌తో 'తగ్గేదేలే' అంటున్న నీరజ్ చోప్రా.. రణ్‌వీర్‌తో డ్యాన్స్‌లో అథ్లెట్ ఫోటీ

13 October 2022, 16:16 ISTMaragani Govardhan
13 October 2022, 16:16 IST

Neeraj chopra Pushpa Style: ప్రముఖ జావిలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. అల్లు అర్జున్‌తో కలిసి సందడి చేశాడు. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022 ఈవెంట్‌కు హాజరైన ఈ అథ్లెట్ అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప మేనరిజాన్ని ప్రదర్శించాడు. అంతేకాకుండా రణ్‌వీర్‌తో కలిసి స్టెప్పు కూడా వేశాడు.

Neeraj chopra Pushpa Style: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఇండియన్ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఈ కార్యక్రమం దేశ రాజధాని దిల్లీలో అట్టహాసంగా జరిగింది. సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్‌కు కూడా ఈ అవార్డు లభించింది. ఈ ఈవెంట్‌లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో మన స్టైలిష్ స్టార్‌కు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. పుష్ప సినిమాకు గానూ ఈ పురస్కారం వచ్చింది. క్రీడా విభాగంలో ప్రముఖ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గెల్చుకున్నాడు. అనంతరం అల్లు అర్జున్‌తో కలిసి నీరజ్ చోప్రా సందడి చేశాడు. ఇద్దరూ కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ సందర్భంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలోని ప్రముఖ ఐకానిక్ మేనరిజం తగ్గేదేలేను ఇద్దరూ రీక్రియేట్ చేశారు. నీరజ్ కూడా అల్లు అర్జున్ మాదిరిగా చేతిని గడ్డం కింద పెట్టుకుని మాస్ డైలాగ్ చెప్పడం విశేషం. అంతేకాకుండా తగ్గేదేలే ఫోజును కూడా ఇచ్చారు. ఫోటోగ్రాఫర్లు వీరి ఫోజును క్లిక్ మనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప మేనరిజాన్ని ప్రదర్శించిన నీరజ్ అంతటితో ఆగకుండా.. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో కలిసి కాలు కదిపారు. ఇద్దరూ కలిసి వేదికపై డ్యాన్స్‌తో ఇరగదీశారు. రణ్‌వీర్.. నీరజ్‌కు స్టెప్పులు నేర్పిస్తూ సందడి చేయడం ఆసక్తికరంగా ఉంది. వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం నీరజ్ చోప్రా.. అల్లు అర్జున్, రణ్‌వీర్ సింగ్‌తో కలిసి సందడి చేసిన వీడియోలపై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.

అల్లు అర్జున్ పుష్ప వేదికగా జరిగిన ఫిల్మ్ ఫేర్ పురస్కారాల్లోనూ పుష్ప చిత్రానికి పలు అవార్డుల వచ్చాయి. ఇందులో ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్‌కు ఫిల్మ్ ఫేర్ పురస్కారం లభించింది. ఈ చిత్రానికి మొత్తం 7 అవార్డులు వచ్చాయి. ప్రస్తుంత అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ పుష్ప ది రూల్ కోసం సిద్ధమవుతున్నాడు. దీపావళి తర్వాత ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనున్నట్లు సమాచారం.