Neeraj Chopra Sky Diving: ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా స్కైడైవింగ్‌ చూశారా.. వీడియో-neeraj chopra sky diving video going viral ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Neeraj Chopra Sky Diving Video Going Viral

Neeraj Chopra Sky Diving: ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా స్కైడైవింగ్‌ చూశారా.. వీడియో

Hari Prasad S HT Telugu
Sep 15, 2022 12:06 PM IST

Neeraj Chopra Sky Diving: ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా స్కైడైవింగ్‌నూ ఎంజాయ్‌ చేశాడు. జ్యూరిక్‌ డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ విజేతగా నిలిచిన తర్వాత అతడీ సాహసం చేశాడు.

స్కైడైవింగ్ చేస్తున్న నీరజ్ చోప్రా
స్కైడైవింగ్ చేస్తున్న నీరజ్ చోప్రా (Instagram )

Neeraj Chopra Sky Diving: టోక్యో ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌, జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా స్కై డైవింగ్‌ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ గోల్డెన్‌ బాయ్‌.. ఇప్పుడు బయట కూడా ఇలాంటి సాహసాలతో వార్తల్లో నిలుస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

ఒలింపిక్స్‌లో ట్రాక్‌ అండ్ ఫీల్డ్‌లో గోల్డ్‌ గెలిచిన తొలి ఇండియన్‌ అథ్లెట్‌, వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్‌ గెలిచిన తొలి ఇండియన్‌, డైమండ్‌ లీగ్‌ ఛాంపియన్‌గా నిలిచిన తొలి ఇండియన్‌ అథ్లెట్‌గా నిలిచిన నీరజ్‌ చోప్రా.. స్కైడైవింగ్‌నూ ధైర్యంగానే చేశాడు.

జిందగీ న మిలేగీ దొబారా అనే బాలీవుడ్‌ మూవీలో ముగ్గురు హీరోలు చేసినట్లే నీరజ్‌ ఈ స్కైడైవింగ్‌ చేశాడు. అతని స్కైడైవింగ్‌ వీడియోకు కూడా ఆ మూవీలోని పాటనే బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేయడం విశేషం. 24 ఏళ్ల నీరజ్‌ చోప్రా స్విట్జర్లాండ్‌లో ఈ సాహసం చేశాడు. జ్యూరిక్‌లో డైమండ్‌ లీగ్‌ ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉన్న నీరజ్‌.. తన స్కైడైవింగ్‌ స్కిల్స్‌ను మెరుగుపరచుకున్నాడు.

ఈ వీడియోను నీరజ్‌ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. అతనితోపాటు ఓ ట్రైనర్‌ కూడా స్కైడైవ్‌ చేశాడు. ఆకాశం కూడా హద్దు కాదు అంటూ స్విట్జర్లాండ్‌ టూరిజం కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ స్కైడైవింగ్‌కు వెళ్లే సమయంలో కూడా నీరజ్‌ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఆ తర్వాత వేల అడుగుల ఎత్తులోనూ అతడు డైవ్‌ను ఎంజాయ్‌ చేశాడు.

ఇక జావెలిన్‌ త్రోలో నీరజ్‌ దూకుడుకు అడ్డే లేకుండా పోతోంది. కామన్వెల్త్‌ గేమ్స్‌కు గాయం కారణంగా దూరమైనా.. ఆ తర్వాత తిరిగి వచ్చి లాసానె డైమండ్‌ లీగ్‌లో గెలిచి జ్యూరిక్‌ డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌కు క్వాలిఫై అయిన తొలి ఇండియన్‌గా రికార్డు సృష్టించాడు. ఇక ఫైనల్స్‌లోనూ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు.

WhatsApp channel

టాపిక్