Budget 2022 | టోక్యో ఒలింపిక్స్‌ ఎఫెక్ట్‌.. స్పోర్ట్స్‌కు పెరిగిన కేటాయింపులు-sports allocations increased in budget 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Sports Allocations Increased In Budget 2022

Budget 2022 | టోక్యో ఒలింపిక్స్‌ ఎఫెక్ట్‌.. స్పోర్ట్స్‌కు పెరిగిన కేటాయింపులు

Hari Prasad S HT Telugu
Feb 01, 2022 04:36 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో మన వాళ్ల ప్రతిభ చూశాం కదా. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడు మెడల్స్‌ గెలిచారు. ఆ తర్వాత పారాలింపిక్స్‌లోనూ 19 మెడల్స్‌తో చరిత్ర సృష్టించారు. ఆ ప్రభావం ఇప్పుడు స్పోర్ట్స్‌కు బడ్జెట్‌ కేటాయింపులపై పడింది.

ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా జరిగిన అండర్ 21 మహిళల హాకీ టోర్నీ
ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా జరిగిన అండర్ 21 మహిళల హాకీ టోర్నీ (ANI)

న్యూఢిల్లీ: బడ్జెట్‌ 2022-23లో క్రీడలకు రూ.305.58 కోట్ల కేటాయింపులు పెరిగాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.3062.60 కోట్లు కేటాయించడం గమనార్హం. గతేడాది బడ్జెట్‌లో మొదట రూ.2596 కోట్లు కేటాయించగా.. తర్వాత దానిని రూ.2757 కోట్లకు పెంచారు. 

ఇప్పుడు దాని కంటే ఎక్కువ కేటాయింపులు చేశారు. ఈ ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్‌, ఏషియన్‌ గేమ్స్‌ కూడా జరగనున్న నేపథ్యంలో నిధులను పెంచినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఖేలో ఇండియా కార్యక్రమానికి ఈసారి నిధుల వరద పారింది. 

గత బడ్జెట్‌లో రూ.657.71 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ బడ్జెట్‌లో రూ.974 కోట్లకు పెరిగాయి. ఇక క్రీడాకారులకు ఇచ్చే అవార్డులు, ప్రోత్సాహకాలకు ఉన్న కేటాయింపులు కూడా రూ.245 కోట్ల నుంచి రూ.357 కోట్లకు చేరడం విశేషం. అయితే స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు మాత్రం ఈ బడ్జెట్‌లో రూ.7.41 కోట్లు తగ్గి రూ.653 కోట్లకు చేరింది.

WhatsApp channel

సంబంధిత కథనం