Allu Arjun Sneha in golden temple: గోల్డెన్‌ టెంపుల్‌లో భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన అల్లు అర్జున్‌-allu arjun sneha in golden temple to celebrate her birhtday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun Sneha In Golden Temple To Celebrate Her Birhtday

Allu Arjun Sneha in golden temple: గోల్డెన్‌ టెంపుల్‌లో భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన అల్లు అర్జున్‌

HT Telugu Desk HT Telugu
Sep 29, 2022 04:23 PM IST

Allu Arjun Sneha in golden temple: గోల్డెన్‌ టెంపుల్‌లో భార్య స్నేహ బర్త్‌డే సెలబ్రేట్‌ చేశాడు అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

గోల్డెన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేస్తున్న అల్లు అర్జున్, స్నేహ
గోల్డెన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేస్తున్న అల్లు అర్జున్, స్నేహ

Allu Arjun Sneha in golden temple: టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, అతని భార్య స్నేహా రెడ్డి గురువారం (సెప్టెంబర్‌ 29) అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌కు వెళ్లారు. అక్కడే ఆమె బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. అర్జున్‌, స్నేహతోపాటు పిల్లలు అయాన్‌, అర్హ కూడా గోల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించారు.

ఈ నలుగురూ కలిసి గోల్డెన్‌ టెంపుల్‌లో కలియతిరుగుతూ ఆ ఆలయం గొప్పదనాన్ని పరిశీలించారు. గోల్డెన్‌ టెంపుల్‌లోకి ఎవరైనా వెళ్లినప్పుడు తప్పనిసరిగా తలపాగా కట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో అర్జున్‌, అతని తనయుడు పాగా కట్టుకోగా.. స్నేహ, అర్హ తమ చున్నీలను తలకు చుట్టకొని కనిపించారు. ప్రస్తుతం ఈ స్టైలిష్‌ స్టార్‌ ఫ్యామిలీ గోల్డెన్‌ టెంపుల్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

<p>అల్లు అర్జున్ కుటుంబానికి జ్ఞాపికను అందజేస్తున్న గోల్డెన్ టెంపుల్ పెద్దలు</p>
అల్లు అర్జున్ కుటుంబానికి జ్ఞాపికను అందజేస్తున్న గోల్డెన్ టెంపుల్ పెద్దలు

ఈ వీడియోను అల్లు అర్జున్‌ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. గురుద్వారాలో ప్రత్యేక సేవలో పాల్గొని, సిక్కు గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. గోల్డెన్‌ టెంపుల్‌కు వెళ్లిన సమయంలో అర్జున్‌ నీలి రంగు కుర్తా, పైజామాలో కనిపించాడు. అంతకుముందు స్నేహ కట్‌ చేసిన వీడియోను కూడా అతడు తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు ఫ్యాన్స్‌కు బాగా నచ్చాయి. ఎంతో మంది హార్ట్‌ ఎమోజీలతో కామెంట్స్‌ చేశారు. అర్జున్‌, స్నేహ 2011లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్లకు మొదట అయాన్‌, తర్వాత అర్హ జన్మించారు.

పుష్ప మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన అల్లు అర్జున్‌ ఇప్పుడు పుష్ప 2 మూవీ షూటింగ్‌ కోసం సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. ఫస్ట్‌ పార్ట్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో ఈ సెకండ్‌ పార్ట్‌ కోసం బన్నీ తన రెమ్యునరేషన్‌ భారీ పెంచేశాడనీ, ప్రస్తుతం ఈ మూవీకి అతడు తీసుకుంటున్న మొత్తం రూ.125 కోట్లని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

IPL_Entry_Point