Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ నినాదం, టికెట్ ధరల ప్రకటన
ఒలింపిక్స్ 2024 ఒలింపిక్స్‌కు సంబంధించిన ఏర్పాట్లు అప్పుడే ప్రారంభమయ్యాయి. పారిస్‌లో జరగనున్న విశ్వక్రీడల నినాదాన్ని నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాకుండా ఈ వేడుకకు సంబంధించిన టికెట్ల రేట్లను కూడా విడుదల చేశారు.
నాలుగేళ్లకు ఓ సారి నిర్వహించే ఒలింపిక్స్ క్రీడల కోసం ప్రపంచ నలుమూలల నుంచి అథ్లెట్లు, క్రీడాకారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. విశ్వక్రీడల్లో పతకం కోసం ఒళ్లు ఊనమయ్యేలా కష్టపడతారు. కరోనా కారణంగా 2020లో టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ 2021లో నిర్వహించారు. ఈ సారి 2024లో(Olympics 2024) పారిస్ వేదికగా విశ్వక్రీడలు జరగనున్నాయి. తాజాగా ఈ పారిస్ ఒలింపిక్స్ క్రీడల నినాదాన్ని ప్రకటించారు నిర్వాహకులు. అంతేకాకుండా డిసెంబరు నుంచి అభిమానులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
"ఆటలు విస్తృతంగా బహిర్గతమవ్వాలి (Games Wide Open)" అనే నినాదంతో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ నినాదంతో పాటు ఒలింపిక్స్, పారాలిపిక్స్‌కు సంబంధించి వేగంగా, ఉన్నతంగా, శక్తిమంతంగా అంటూ అదిరిపోయే వీడియోను విడుదల చేశారు. మరింత కలుగోలుతనంతో, మరింత సోదరభావంతో, మరింత అందంగా(Mre Inclusive, More Brotherly, More Beautiful) పాలు పంచుకోవాలని ఆకాంక్షించారు.
"ప్రపంచమంతా కలిసి కొత్త భావోద్వేగాలను అనుభవించడానికి ఇదే మా ఆహ్వానం. ఈ ఆటలు అపూర్వమైన అనుభవం, అలాగే శక్తిమంతమైన అనుభూతుల వాగ్ధానం" అని నిర్వాహకులు స్పష్టం చేశారు.
డిసెంబరు నుంచి అభిమానులు టికెట్లను దరఖాస్తు చేసుకునేలా ఇందుకు సంబంధించిన ధరలను ప్రకటించారు. ఒలింపిక్స్, పారాలింపిక్స్ ఈ రెండు క్రీడలకు సంబంధించి 13 మిలియన్ల(కోటీ 30 లక్షల) టికెట్లను విక్రయించనున్నారు. అంతేకాకుండా ఇందులో సగం టికెట్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా 50 యూరోల(దాదాపు రూ.4080) లోపే ధర నిర్దేశించారు. అయితే ప్రారంభ, ముగింపు వేడుకల టికెట్ల ధరల్లో వ్యత్యాసముంది. ఈ వేడుకలకు ఒక్కో టికెట్ 24 యూరోల నుంచి 950 యూరోల వరకు ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.
మూడు వేర్వేరు ఈవెంట్‌ల టికెట్లతో కూడిన ప్యాకేజీలు 72 యూరోల నుంచి అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి నుంచి ఈ టికెట్లను విక్రయించనున్నారు. సోమవారం నాడు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మెక్రాన్ ఈ మెగా ఈవెంట్ కోసం ఖర్చులు, భద్రత గురించి పెరుగుతున్న ఆందోళనలను చర్చించడానికి సీనియర్ మంతులను సమావేశపరిచారు. ఫ్రాన్స్ ఆడిట్ సంస్థ కోర్ డెస్ కాంప్టెస్, ఇటీవల నివేదించిన నివేదికలో గణనీయమైన భద్రతా సవాళ్లను కోసం సన్నహాలను వేగవంతం చేయాలని హెచ్చరించింది.
సంబంధిత కథనం
టాపిక్