తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Legends League Cricket 2023: లెజెండ్స్ లీగ్ క్రికెట్.. కెప్టెన్లుగా గంభీర్, అఫ్రిది, ఫించ్

Legends League Cricket 2023: లెజెండ్స్ లీగ్ క్రికెట్.. కెప్టెన్లుగా గంభీర్, అఫ్రిది, ఫించ్

Hari Prasad S HT Telugu

01 March 2023, 22:09 IST

    • Legends League Cricket 2023: లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 ప్రారంభం కాబోతోంది. ఇందులో పాల్గొనే టీమ్స్ కెప్టెన్లుగా గంభీర్, అఫ్రిది, ఫించ్ వ్యవహరించనున్నారు. బుధవారం (మార్చి 1) ఈ లీగ్ లోని టీమ్స్ కెప్టెన్లను అనౌన్స్ చేశాయి.
ఇండియా మహరాజాస్ టీమ్ కెప్టెన్ గౌతమ్ గంభీర్
ఇండియా మహరాజాస్ టీమ్ కెప్టెన్ గౌతమ్ గంభీర్

ఇండియా మహరాజాస్ టీమ్ కెప్టెన్ గౌతమ్ గంభీర్

Legends League Cricket 2023: లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్‌సీ) మరో సీజన్ కు సమయం దగ్గర పడింది. ఈ టోర్నీ మార్చి 10 నుంచి 20 వరకు ఖతార్ లోని దోహాలో ఉన్న ఏషియన్ టౌన్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ టోర్నీలో ఇండియా మహరాజాస్ టీమ్ తోపాటు ఏషియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ జట్లకు కెప్టెన్లను బుధవారం (మార్చి 1) అనౌన్స్ చేశారు. ఇండియా మహరాజాస్ కు గౌతమ్ గంభీర్, ఏషియా లయన్స్ కు షాహిద్ అఫ్రిది, వరల్డ్ జెయింట్స్ కు ఆరోన్ ఫించ్ కెప్టెన్లుగా ఉండనున్నారు. ఈ లీగ్ లో ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఉతప్ప, శ్రీశాంత్, ఆరోన్ ఫించ్, షాహిద్ అఫ్రిది, మహ్మద్ హఫీజ్, తిలకరత్నె దిల్షాన్, క్రిస్ గేల్, బ్రెట్ లీలాంటి లెజెండ్స్ ఆడనున్నారు.

ఒకప్పటి లెజెండ్స్ ను మళ్లీ క్రికెట్ ఫీల్డ్ లో చూసే అవకాశం ఈ లీగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు కలగనుంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో తొలిసారి ఆడుతున్న షాహిద్ అఫ్రిది.. ఏషియా లయన్స్ జట్టుకు కెప్టెన్ అవడం విశేషం. గొప్ప ప్లేయర్స్ ఉన్న జట్టుకు నాయకత్వం వహించనుండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు అఫ్రిది చెప్పాడు.

షోయబ్, హఫీజ్, రజాక్ లాంటి మాజీ ప్లేయర్స్ తో కలిసి తాను ఆడుతుండటం సంతోషంగా ఉందని అన్నాడు. ఇక ఈ మధ్యే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న ఆరోన్ ఫించ్.. వరల్డ్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఎల్ఎల్‌సీ ఓ ప్రత్యేకమైన కాన్సెప్ట్ అని, ఇందులో ఆడుతుండటం చాలా సంతోషంగా ఉందని ఫించ్ అన్నాడు.

ఇక ఇండియా మహరాజాస్ టీమ్ కెప్టెన్ అయిన గంభీర్ మాట్లాడుతూ.. గతంలోనూ తాను ఈ ఎల్ఎల్‌సీ కుటుంబంలో భాగంగా ఉన్నానని, ఇలాంటి ఆసక్తికరమైన టోర్నమెంట్ లో ఆడటం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందని చెప్పాడు. ఇండియా మహరాజాస్ జట్టులో ఉన్న వాళ్లందరితోనూ తాను గతంలో ఇండియన్ టీమ్ లేదా దేశవాళీ టీమ్స్ లో కలిసి ఆడినట్లు గుర్తు చేసుకున్నాడు.

తదుపరి వ్యాసం