తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kmaran Akmal Babar Azam Captaincy: 'కోహ్లీ స్థాయికి బాబర్ వెళ్లాలంటే.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు'.. పాక్ మాజీ వ్యాఖ్య

Kmaran Akmal Babar Azam Captaincy: 'కోహ్లీ స్థాయికి బాబర్ వెళ్లాలంటే.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు'.. పాక్ మాజీ వ్యాఖ్య

15 September 2022, 19:31 IST

    • Kamran Akmal About Babar Azam: పాక్ సారథి బాబర్ ఆజం ఫామ్, కెప్టెన్సీపై ఆ దేశ మాజీలు విమర్శలు సంధిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన పాక్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్.. బాబర్ బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాలని సూచించాడు.
బాబర్ ఆజం
బాబర్ ఆజం (ICC Twitter)

బాబర్ ఆజం

Kamran Akmal About Babar Azam Captaincy: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యాటర్.. ఆసియా కప్‌లో మాత్రం విఫలమయ్యాడు. ఫలితంగా సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటున్నాడు. పాకిస్థాన్ మెరుగైన ప్రదర్శన చేసి ఆసియా కప్ ఫైనల్ చేరినప్పటికీ.. టైటిల్‌ను మాత్రం గెలవలేకపోయింది. దీంతో బాబర్ ఆజం ఫామ్, కెప్టెన్సీపై ప్రశ్నలు లెవనెత్తుతున్నాయి. ఎందుకంటే అతడు ఆరు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 68 పరుగులే చేశాడు, శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో అత్యధికంగా 30 పరుగులు చేశాడు. పాక్ మాజీలు అక్తర్, ఇంజిమామ్, మొయిన్ ఖాన్ తదితరులు ఇప్పటికే అతడిపై విమర్శలు చేశారు. తాజాగా అతడి ఫామ్, కెప్టెన్సీపై పాక్ మాజీ పేసర్ కమ్రాన్ అక్మల్ స్పందించాడు. ఈ విషయం గురించి అతడికి ముందే చెప్పినట్లు గుర్తు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

బాబర్ ఆజం పాకిస్థాన్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా తొలిసారిగా 2020 జనవరిలో అయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మొదటిసారిగా పగ్గాలు చేపట్టాడు. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడే తాను బాబర్‍‌కు కెప్టెన్సీ గురించి తెలియజేశానని అక్మల్ అన్నాడు.

"ఫైసలాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో బాబర్ టాస్‌కు వచ్చాడు. నాకు అప్పుడే తెలిసిందే అతడు కెప్టెన్ అయ్యాడని.. అప్పుడే నేను అతడితో మాట్లాడాను. కెప్టెన్ అవ్వడానికి ఇది నీకు సరైన సమయమో లేదో నాకు తెలియదు. రాబోయే 2, 3 ఏళ్లు నువ్వు నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. బ్యాటింగ్ లైనప్ నీపై ఆధారపడి ఉంది. ముందు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ స్థాయికి చేరుకోవాలి. 35 నుంచి 40 సెంచరీలు చేసిన తర్వాత కెప్టెన్సీని ఎంజాయ్ చేయ్. సర్ఫారాజ్ ఖాన్ కూడా ఇలాగే వెళ్లిపోయాడు.. ఆ లైన్‌లో తర్వాత నువ్వు వెళ్లే అవకాశముంది. అని మంచి నిర్ణయం తీసుకోమని సలహా ఇచ్చాను." అంటూ అక్మల్ స్పష్టం చేశాడు.

ఈ ఏడాది మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఎంపికైన బాబర్ ఆజంను తాను బ్యాటింగ్‌పై ఫోకస్ చేయమని సూచించినట్లు అక్మల్ తెలిపాడు. "నేను అతడిని ముందు బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టమని కూడా సలహా ఇచ్చా. పరుగులు బాగా చేస్తుంటే.. తన కెరీర్ బాగా ముందుకెళ్తుంది. అతడి బ్యాటింగ్ చూడటాన్ని ప్రజలు ఆస్వాదిస్తారు. కెప్టెన్సీలో ఒత్తిడి ఉంటుంది. అది బ్యాటింగ్‌పై ప్రభావం పడే అవకాశముంది. ఎప్పుడోకప్పుడు ఆ విషయం తెలుస్తుంది. ఇదే సమయంలో అతడిని కెప్టెన్‌గా తొలగించడం మేనేజ్మెంట్ చేసిన పెద్ద తప్పిదం అవుతుంది. పాక్ క్రికెట్ మళ్లీ వెనక్కి వెళ్తుంది" అని అక్మల్ పేర్కొన్నాడు.

గతంతో పోలిస్తే బాబర్ ఆజం ఇప్పుడు పరణితి చెందాడని అక్మల్ అన్నాడు. "అతడు కెప్టెనై 2 నుంచి 3 ఏళ్లు అవుతుంది. అయితే ఇంకా మెరుగ్గా రాణించాల్సి ఉంది. ఆసియా కప్ ఫైనల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన తీరు ప్రశంసనీయం. నవాజ్ లాంటి బౌలర్లను చక్కగా వాడుకున్నాడు. అయితే ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నప్పుడు బాబర్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. ఫఖార్ జమాన్‌ను ఓపెనింగ్ చేయించాల్సింది." అని అక్మల్ తెలిపాడు.

తదుపరి వ్యాసం