తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Jyothi Yarraji National Record: జ్యోతి అరుదైన ఘనత.. 13 సెకండ్లలోనే హర్డిల్ రేసు పూర్తి.. తొలి భారత మహిళగా రికార్డు

Jyothi Yarraji National Record: జ్యోతి అరుదైన ఘనత.. 13 సెకండ్లలోనే హర్డిల్ రేసు పూర్తి.. తొలి భారత మహిళగా రికార్డు

18 October 2022, 8:58 IST

    • Jyothi Yarraji National Record: భారత అథ్లెట్ జ్యోతి అథ్లెట్ అరుదైన ఘనత సాధించింది. 100 మీటర్ల హర్డిల్ విభాగంలో 13 సెకండ్ల అడ్డంకిని అధిగమించింది. కేవలం 12.82 సెకండ్లలోనే పరుగును పూర్తి చేసి ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించింది.
జ్యోతి యర్రాజీ
జ్యోతి యర్రాజీ (Twitter/SAI)

జ్యోతి యర్రాజీ

Jyothi Yarraji National Record: భారత అథ్లెటిక్స్‌లో మరో సంచలన రికార్డు నమోదైంది. ప్రముఖ అథ్లెట్ జ్యోతి యర్రాజీ తన జాతీయ రికార్డును తానే రెండో సారి తిరిగరాసి అరుదైన ఘనతను సాధించింది. 100 మీటర్ల హార్డిల్స్ పరుగును కేవలం 13 సెకండ్లలోనే ముగించి చరిత్రసృష్టించింది. ఈ ఘనతను సాధించిన మొదటి భారత మహిళగా రికార్డు సొంతం చేసుకుంది. సోమవారం నాడు జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో ఈ రికార్డును సృష్టించింది.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

23 ఏళ్ల జ్యోతి రైల్వేస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది. 100 మీటర్ల హార్డిల్స్ పోటీని 12.82 సెకండ్లలో పూర్తి చేసింది. అంటే సెకనుకు 0.9 మీటర్లను అందుకుంది. అయితే గాంధీనగర్‌లో నేషనల్ గేమ్స్‌లో ఇదే ఈవెంట్‌లో తన కెరీర్ బెస్ట్ 12.79 సెకండ్ల రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. అయినప్పటికీ 13 సెకండ్లలోపే ఈ కేటగిరీలో పరుగును పూర్తి చేసిన తొలి భారత మహిళగా ఘనతను అందుకుంది. ఈ ఏడాది మేలో 13.04 సెకండ్లతో జాతీయ రికార్డును నెలకొల్పింది జ్యోతి.

సోమవారం నాడు జరిగిన ఈవెంట్‌లో జ్యోతి అద్భుతమే చేసింది. మెరుగైన ప్రదర్శన చేసి అజేయంగా నిలిచింది. ఆమె ఇప్పటికే హీట్స్ విభాగంలో 13.18 సెకన్లతో మీట్ మార్క్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా 20 ఏళ్ల క్రితం చెన్నై వేదికగా అనురాధ బిస్వాల్ నెలకొల్పిన 13.38 సెకన్ల రికార్డును మెరుగుపరిచింది.

సోమవారం జరిగిన ఫైనల్స్‌లో ఏడుగురు అథ్లెంట్లలో ఆమె ముందు వరుసలో నిలిచింది. చివరి రెండు అడ్డంకి దాటే సమయానికే ముందున్న జ్యోతి.. సునాయాసంగా గెలిచింది. జూన్‌లో చెన్నైలో జరిగిన జాతీయ అంతర్ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో తడపడిన జ్యోతి ఈ సీజన్‌ను అద్భుతంగా ముగించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి రైల్వేస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది. భువనేశ్వర్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది.

ఈ ఏడాది జ్యోతి ఈ ఈవెంట్‌లో రెండో వేగవంతమైన ఆసియన్‌గా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఆల్ టైమ్ టాప్-10 జాబితాకు సమీపంలో నిలిచింది. ఈ ఏడాది ఆమె జాతీయ రికార్డును బ్రేక్ చేయడం ఇది మూడో సారి. మే 22న లాఫ్‌బరో యూనివర్సిటీలో 13.11 సెకన్లతో 2002లో అనురాధ బిస్వాల్‌ రికార్డు 13.38 సెకన్లను అధిగమించింది. నాలుగు రోజుల తర్వాత నెదర్లాండ్స్‌లో జరిగిన టోర్నీలో 13.04 సెకన్లతో మరోసారి రికార్డును బ్రేక్ చేసింది. అంతకుముందు కోజీకోడ్‌లో 13.09 సెకన్లతో ఇంకో రికార్డును సొంతం చేసుకుంది.

టాపిక్

తదుపరి వ్యాసం