తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ireland Bowler Joshua Liitle Hat-trick: టీ20 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌ బౌలర్‌ హ్యాట్రిక్‌

Ireland Bowler Joshua Liitle Hat-trick: టీ20 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌ బౌలర్‌ హ్యాట్రిక్‌

Hari Prasad S HT Telugu

04 November 2022, 13:35 IST

    • Ireland Bowler Joshua Liitle Hat-trick: టీ20 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌ బౌలర్‌ జోషువా లిటిల్‌ హ్యాట్రిక్‌ సాధించాడు. న్యూజిలాండ్‌తో శుక్రవారం (నవంబర్ 4) జరిగిన మ్యాచ్‌లో లిటిల్‌ ఈ ఘనత సాధించిన రెండో ఐర్లాండ్‌ బౌలర్‌గా నిలిచాడు.
ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్
ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్ (AFP)

ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్

Ireland Bowler Joshua Liitle Hat-trick: టీ20 వరల్డ్‌కప్‌ 2022లో రెండో హ్యాట్రిక్‌ నమోదైంది. ఈ ఏడాది తొలి రౌండ్‌ మ్యాచ్‌లో యూఏఈ బౌలర్‌ కార్తీక్‌ మేయప్పన్‌ శ్రీలంకపై తొలి హ్యాట్రిక్‌ తీసుకున్న విషయం తెలుసు కదా. ఇక శుక్రవారం (నవంబర్ 4) జరిగిన సూపర్‌ 12 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఐర్లాండ్‌ బౌలర్‌ జోషువా లిటిల్‌ కూడా హ్యాట్రిక్‌ తీసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో ఇది జరిగింది. అతడు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌తోపాటు జిమ్మీ నీషమ్, మిచెల్‌ సాంట్నర్‌ల వికెట్లను తీశాడు. గతేడాది జరిగిన వరల్డ్‌కప్‌లోనూ ఐర్లాండ్‌కే చెందిన కర్టిస్‌ కాంఫర్‌ హ్యాట్రిక్‌ తీసుకున్నాడు. అతడు నెదర్లాండ్స్‌పై ఈ ఘనత సాధించగా.. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్‌ తీసుకున్న రెండో ఐర్లాండ్‌ బౌలర్‌గా లిటిల్‌ నిలిచాడు.

19వ ఓవర్‌ రెండు, మూడు, నాలుగు బంతుల్లో లిటిల్‌ వరుసగా మూడు వికెట్లు తీశాడు. రెండో బంతికి విలియమ్సన్‌ను ఔట్‌ చేసిన అతడు.. మూడు, నాలుగు బంతుల్లో నీషమ్, సాంట్నర్‌లను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపించాడు. ఇక టీ20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్‌ సాధించిన ఆరో బౌలర్‌గా కూడా లిటిల్‌ ఘనత సాధించాడు. టీ20 వరల్డ్‌కప్‌లలో నమోదైన ఆరు హ్యాట్రిక్‌లలో మూడు గతేడాది కాగా.. రెండు ఈసారి నమోదయ్యాయి. అయితే అతని హ్యాట్రిక్‌ వృథా అయింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 35 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది.

టీ20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్‌ వీరులు

బ్రెట్‌ లీ vs బంగ్లాదేశ్‌, 2007

కర్టిస్‌ కాంఫర్‌ vs నెదర్లాండ్స్‌, 2021

వానిందు హసరంగా vs సౌతాఫ్రికా, 2021

కగిసో రబాడా vs ఇంగ్లండ్‌, 2021

కార్తీక్‌ మేయప్పన్‌ vs శ్రీలంక, 2022

జోషువా లిటిల్‌ vs న్యూజిలాండ్‌, 2022

తదుపరి వ్యాసం